Monday, June 26, 2023

BALVIKAS CONVOCATION AT SIVAM ON 25-6-2023




 




ఓం శ్రీ సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు అనుగ్రహంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ జిల్లాలో గల, 16 సమితులలో, 67 మంది బాలవికాస్, విద్యార్థులు, వారి బాలవికాస్, 9 సంవత్సరముల బాలవికాస్ కోర్సును పూర్తి గావించుకున్నారు. వారందరికీ ఈరోజు అనగా, 25 6 2023 న నా,  భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో, " డిప్లమో ఇన్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్" ప్రశంసా పత్రాలని, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, ఏ మల్లేశ్వర రావు గారు,  స్టేట్ బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీ హరినాథ్ రెడ్డి -  హైదరాబాద్ జిల్లా బాలవికాస్ కోఆర్డినేటర్స్, శ్రీమతి లత గారు, శ్రీ ఫణి గారు, ప్రశంసా పత్రాలను,  ప్రి సేవాదళ్ స్కార్ఫులను, ధరింపజేశారు. కార్యక్రమానికి ముందుగా, విద్యార్థులంతా కలిసి, శ్రీ సూక్తం పురుష సూక్తం, ఎంతో శ్రావ్యంగా భక్తి పూర్వకంగా, పఠించారు. తదనంతరం, సుస్వరమైన  కంఠముతో, విద్యార్థులంతా, భజనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో, బాలవికాస్ విద్యార్థులతో పాటు, బాలవికాస్ గురువులుగా శిక్షణ పొందనున్న సభ్యులు, మహిళా ఇన్చార్జీలు బాలవికాస్ గురువులు, సమితి కన్వీనర్లు, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత, మరియు రాష్ట్రస్థాయి బాలవికాస్ ఫ్యాకల్టీ శ్రీమతి ఆధ్వర్యంలో హైమావతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రశంసా పత్రాలను సర్టిఫికెట్లను అందజేశారు. అందరూ విద్యార్థులు, ప్రియ సేవాదళ్ సభ్యులుగా, వారి అమూల్యమైన సేవలను అందిస్తామని, ప్రతిజ్ఞ చేశారు. మేమంతా సాయి సంస్థలలో, పదునైన పనిముట్లుగా, తయారు కావాలని ప్రార్ధనలు తెలిపారు.

కోటి సమితి నుండి కుమారి మహంకాళి సాయి రూప, మాస్టర్ హేమాంగ్ నాగ, మాస్టర్ జంబుల ప్రణవెండర్ రెడ్డి, మాస్టర్ మహంకాళి సాయి గుప్తా ప్రశంసా పత్రములను, మరియు ప్రీ సేవాదళ్ స్కార్ప్స్ లతో, మరియు గురువులు, శ్రీమతి రేణుక, శ్రీమతి శైలేశ్వరి, సమితి  కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మరియి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు ఈ ఫోటో లో వున్నారు. 

 

Sunday, April 30, 2023

MATRU POOJA BY BALVIKAS CHILDREN ON HE OCCASION OF ESHWARAMMA DAY TO BE HELD ON 6-5-2023

 








మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా బాలవికాస్ విద్యార్థులచే మాతృ పూజలు 30-4-2023


భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో  శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, మే 6న, జరగనున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈరోజు, అనగా, 30 4 2023న,  శ్రీ సత్య సాయి బాలవికాస్  విద్యార్థులచే, మాతృ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ప్రధమంగా మూడుసార్లు ఓంకారం, భజన, శాంతి మంత్రం, ముందుగా పిల్లలు, మాతృమూర్తుల పాదాలకు, పసుపు కుంకుమలు గంధము, పూసి, అష్టోత్తర పూజ నిర్వహించిన తదనంతరం, హారతి  ఇచ్చారు 


మాతృ పూజ దినోత్సవం గురించి, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి గురించి, పుట్టపర్తి నుండి విశ్వవ్యాప్తంగా,భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి బాబా , చేయించిన, విద్యా, వైద్య, త్రాగునీటి సేవా కార్యక్రమాలను, గూర్చి బాలవికాస్ గురువులు ఎంతో చక్కగా వివరించారు.

Sairam 




Monday, January 9, 2023

 SRI SATHYA SAI BALVIKAS CHILDREN OFFERING PRAYERS TO THEIR PARENTS

Jan 8, 2023

An unique scene that brings back to life the ancient Sanatan tradition of offering "Pada Puja" to one's parents. This matchless tradition is coming back with much more vigour thanks to the Sri Sathya Sai Balvikas programme that is undertaken by Sri Sathya Sai Organisation around the world.

Balvikas programme  is massive in India where in there are close to 20,000 Balvikas centers currently functioning in India alone, with a whopping Four hundred and fifty thousand (4,50,000) active children and calculating the inception year of Balvikas by Swami in the year 1969, there could be easily 5 million Balvikas Allumni doing their bit in their own humble way to the society. 

Over the year Balvikas programme  has had a huge impact amongst the children where volunteers visit various places with their own expenses, every weekend and teach moral values to the children from all walks of life not necessarily Sai families.

This particular video is from DR Colony Balvikas Center in a town called Hindupur (About 2 hours from Puttaparthi).

If you happen to have children in your homes, do send them to the nearest Sri Sathya Sai Balvikas programme to secure a bright future to the future citizens of this Yuga

Jai Sairam -  Satish Naik - Puttaparthi

Thursday, December 1, 2022

GEETA JAYANTHI VEDUKALU: 3-12-2022: KUNTAROAD HIGH SCHOOL, OSMAN GUNJ. HYD.

 














Report on dt 3-12-2022 గీతా జయంతి వేడుకలు

 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి  ఆధ్వర్యంలో ఈరోజు అనగా 3 డిసెంబర్,   2022న హైదరాబాద్, ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా   మసీదుకు సమీపములో ఉన్న, గవర్నమెంట్ హై స్కూల్, కుంట రోడ్డు,నందుశ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్, విద్యార్థులతో " గీతా జయంతి వేడుకలు కార్యక్రమము  శ్రీమతి రేణుక గారు, ముఖ్య అతిధి స్వామి చిరకాల భక్తులు శ్రీ శరత్ కృష్ణ పరాయత్తం  మరియు సమితి కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం గావించి, ప్రారంభించారు. 

 శ్రీమతి కన్నా రెడ్డి రేణుక గారు,   గత రెండు నెలల నుండి నేర్పిన శ్లోకాలు విద్యార్థులు " నహి జ్ఞానేన సద్రృశం పవిత్ర మిహ విద్యతే - తత్ స్వయం యోగ సంసిద్దః కాలేనాత్మని విన్దతి. అనే శ్లోకలనుఎంతో భక్తి శ్రద్దలతో ఏకకంఠంతో ఈ పవిత్ర గీతా జయంతి వేడుకల సందర్భంగా,   వినిపించి, గురుదక్షిణగా  ఇచ్చారు.   

 ముఖ్య అతిధి, స్వామి చిరకాల భక్తులు శ్రీ శరత్ కృష్ణ పరాయత్తం, శ్రీ సత్య సాయి బాలవికాస్  గ్రూప్ - I లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రశంసా పత్రములను బహుకరించిన అనంతరం వారు  మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా  సంస్థలు కోటి సమితి చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమము, ఎంతగానో కొనియాడుతూభగవద్గీత  ప్రాముఖ్యతను, విద్యార్థుల స్థాయిలో విశదీకరించిభగవద్గీతలో  అన్నిభాషలలో వున్నదని, అన్ని దేశాలలో ఈ రోజు గీతా జయంతి జరుపువుకున్నారని, మనము కూడా ఎంతో అదృష్టవంతులమని  మనము కూడా రోజు  భగవత్ గీత ఒక్క శ్లోకము చదివి దాని భావాన్ని తెలుసుకొని, మన నిత్యజీవితములో అనుసరించవనేనని తెలిపారు. అందరితో ఈ శ్లోకాన్ని వల్లెవేయించారు.  అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।।

 ఈ కార్యక్రమంలో, శ్రీమతి విజయ లక్ష్మి , శ్రీమతి కల్పనా, శ్రీమతి సునీత,   హై స్కూల్ ప్రిన్సిపాల్, శ్రీ కె. శశికళ గారుశ్రీ దార సింగ్ గారు  శ్రీ వి నాగేశ్వర రావు  పాల్గొన్నారు సాయిరాం 

  

కన్వీనర్ 

పి . విశ్వేశ్వర శాస్త్రి. 



Friday, July 15, 2022

KOTI SAMITHI BALVIKAS GROUP II EXAMINATION CANDIDATES: DT 24-7-2022

 




 *With the Divine Blessings of Bhagawan Sri Sathya Sai Baba Varu, Sri Sathya Sai Balvikas Group II Examination conducted smooth and and Question Papers Both English and Telugu were kept at Divine Lotus Feet and opened after chanting Omkaaram, Gayatri Mantra, and Shantimantrams. at 10-02 and given the Answer Books and Question Papers... at 12-02 Examination completed all the 9 Students and all the Answer Books collected after completion of writing marked the sl nos also and kept in sl along with coverning letter and duly sealed handed over to Sri Hariharan Garu, at Sivam Office at 1-25 Pm today. Sairam*













KUMARI SAIROOPA, MASTER HEMANG, MASTER PRANAV, MASTER SAI GUPTA HAVE COMPLETED PROJECT WORK AND PLACED THE SAME AT THE LOTUS FEET OF OUR BELOVED BHAGAWAN SRI SRI SRI SATHYA SAI BABA VARI AT SIVAM ON 25-12-2022 

Saturday, December 11, 2021

WALK FOR THE VALUES: 13-12-2021 WITH PRESS CLIPPINGS

 








"మానవతా విలువల పై విద్యార్థుల ప్రదర్శన"

ప్రజల్లో మానవతా విలువలను పెంపొందించే లక్ష్యంతో సత్యసాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో,  విలువలతో కూడిన నడక పేరిట, చేసిన ప్రదర్శనలో  పాల్గొన్న విద్యార్థులు, నీతి వాక్యాలు మానవతా విలువలతో  రూపొందించిన, ప్లై  కార్డులను చేత పట్టుకొని సాయి గాయత్రీ మంత్రం పఠిస్తూ  సుల్తాన్ బజార్,  ప్రధాన వీధుల్లో ప్రదర్శన గావించారు. 

దేవుడు ఒక్కడేనని,  సాటి మనిషిని ప్రేమిస్తూ సేవా తత్వాన్ని కలిగి ఉండడమే జీవిత పరమార్థమని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి,  సభ్యులు  విలువలతో కూడిన  ర్యాలీని కోటి సమితి దత్తత తీసుకున్న సుల్తాన్ బజార్, బడే చౌది లో నయా బజార్ గవర్నమెంట్, హై స్కూల్ లో, అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్, జండా ఊపి విలువలతో కూడిన నడకను ను ప్రారంభించారు. 

తొలుతగా కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, వేదం, సాయి గాయత్రీ మంత్రములను జపిస్తూ, కార్యక్రమము కొనసాగినది. అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్,  కోటి సమితి చేస్తున్న అనేక కార్యక్రమాలను అభినందిస్తూ ప్రతి ఒక్కరూవిలువలతో కూడిన నడవడికను పెంపొందించుకోవాలని అన్నారు. 

స్వామి వారి ప్రేమ ను 2022 డైరీ రూపంలో స్వామి చిర కాల భక్తులు శ్రీ శరత్ చంద్ర గారు అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్ గారికి బహకరించారు. 

ఈ కార్యక్రమములో బాలవికాస గురువులు, విద్యార్థులు, మహిళలు,   కూడా పాల్గొన్నారు. 

అందరినీ ప్రేమించు అందరినీ సేవించు, మానవసేవే మాధవసేవ, ఒకే భాష అదే హృదయ భాష ప్రదర్శించారు.

ఈ ప్రదర్శన కార్యక్రమము కందస్వామి లో గల షిరిడి బాబా దేవాలయంలో శ్రీ శ్రీ శరత్ చంద్ర గారు విద్యార్థుల నుద్దేశించి వాల్యూస్ గూర్చి విపులంగా పిల్లల కు అర్ధమయ్యే రీతిలో, రామయంలో లోని కధలు, మహాత్ముల జీవితాల విశేషాలలో మనం నేర్చుకోవలసిన అనేక విలువలను పిల్లలకు హత్తుకొనే విధముగా, తెలిపారు. 

ఈ నాటి కార్యక్రములో, బాలవికాస్ విద్యార్థులు, వారి తల్లితండ్రులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.