ఓం శ్రీ
సాయిరాం, భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య ఆశీస్సులు
అనుగ్రహంతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు హైదరాబాద్ జిల్లాలో
గల, 16 సమితులలో, 67 మంది బాలవికాస్,
విద్యార్థులు, వారి బాలవికాస్, 9 సంవత్సరముల బాలవికాస్ కోర్సును పూర్తి గావించుకున్నారు. వారందరికీ ఈరోజు
అనగా, 25 6 2023 న నా, భగవానుడు నడయాడిన శివం మందిర ప్రాంగణంలో,
" డిప్లమో ఇన్ శ్రీ సత్యసాయి ఎడ్యుకేషన్" ప్రశంసా పత్రాలని, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు,
ఏ మల్లేశ్వర రావు గారు, స్టేట్ బాలవికాస్ కోఆర్డినేటర్ శ్రీ హరినాథ్ రెడ్డి - హైదరాబాద్ జిల్లా
బాలవికాస్ కోఆర్డినేటర్స్, శ్రీమతి లత గారు, శ్రీ ఫణి గారు, ప్రశంసా పత్రాలను, ప్రి సేవాదళ్
స్కార్ఫులను, ధరింపజేశారు. కార్యక్రమానికి ముందుగా, విద్యార్థులంతా కలిసి, శ్రీ సూక్తం పురుష సూక్తం,
ఎంతో శ్రావ్యంగా భక్తి పూర్వకంగా, పఠించారు.
తదనంతరం, సుస్వరమైన కంఠముతో, విద్యార్థులంతా,
భజనలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో, బాలవికాస్
విద్యార్థులతో పాటు, బాలవికాస్ గురువులుగా శిక్షణ పొందనున్న
సభ్యులు, మహిళా ఇన్చార్జీలు బాలవికాస్ గురువులు, సమితి కన్వీనర్లు, బెస్ట్ టీచర్ అవార్డు గ్రహీత,
మరియు రాష్ట్రస్థాయి బాలవికాస్ ఫ్యాకల్టీ శ్రీమతి ఆధ్వర్యంలో
హైమావతి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రశంసా
పత్రాలను సర్టిఫికెట్లను అందజేశారు. అందరూ విద్యార్థులు, ప్రియ
సేవాదళ్ సభ్యులుగా, వారి అమూల్యమైన సేవలను అందిస్తామని,
ప్రతిజ్ఞ చేశారు. మేమంతా సాయి సంస్థలలో, పదునైన
పనిముట్లుగా, తయారు కావాలని ప్రార్ధనలు తెలిపారు.
కోటి
సమితి నుండి కుమారి మహంకాళి సాయి రూప, మాస్టర్ హేమాంగ్
నాగ, మాస్టర్ జంబుల ప్రణవెండర్ రెడ్డి, మాస్టర్ మహంకాళి సాయి గుప్తా ప్రశంసా పత్రములను, మరియు
ప్రీ సేవాదళ్ స్కార్ప్స్ లతో, మరియు గురువులు, శ్రీమతి రేణుక, శ్రీమతి శైలేశ్వరి, సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, మరియి హైదరాబాద్
డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీ ఏ మల్లేశ్వర రావు గారు ఈ ఫోటో లో వున్నారు.
No comments:
Post a Comment