మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా బాలవికాస్ విద్యార్థులచే మాతృ పూజలు 30-4-2023
భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి, ఆధ్వర్యంలో, మే 6న, జరగనున్న మాతృశ్రీ ఈశ్వరమ్మ ఆరాధన దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈరోజు, అనగా, 30 4 2023న, శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులచే, మాతృ పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ రోజు ప్రధమంగా మూడుసార్లు ఓంకారం, భజన, శాంతి మంత్రం, ముందుగా పిల్లలు, మాతృమూర్తుల పాదాలకు, పసుపు కుంకుమలు గంధము, పూసి, అష్టోత్తర పూజ నిర్వహించిన తదనంతరం, హారతి ఇచ్చారు
మాతృ పూజ దినోత్సవం గురించి, మాతృశ్రీ ఈశ్వరమ్మ గారి గురించి, పుట్టపర్తి నుండి విశ్వవ్యాప్తంగా,భగవాన్ శ్రీశ్రీశ్రీ సత్య సాయి బాబా , చేయించిన, విద్యా, వైద్య, త్రాగునీటి సేవా కార్యక్రమాలను, గూర్చి బాలవికాస్ గురువులు ఎంతో చక్కగా వివరించారు.
Sairam
No comments:
Post a Comment