Saturday, December 11, 2021

WALK FOR THE VALUES: 13-12-2021 WITH PRESS CLIPPINGS

 








"మానవతా విలువల పై విద్యార్థుల ప్రదర్శన"

ప్రజల్లో మానవతా విలువలను పెంపొందించే లక్ష్యంతో సత్యసాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో,  విలువలతో కూడిన నడక పేరిట, చేసిన ప్రదర్శనలో  పాల్గొన్న విద్యార్థులు, నీతి వాక్యాలు మానవతా విలువలతో  రూపొందించిన, ప్లై  కార్డులను చేత పట్టుకొని సాయి గాయత్రీ మంత్రం పఠిస్తూ  సుల్తాన్ బజార్,  ప్రధాన వీధుల్లో ప్రదర్శన గావించారు. 

దేవుడు ఒక్కడేనని,  సాటి మనిషిని ప్రేమిస్తూ సేవా తత్వాన్ని కలిగి ఉండడమే జీవిత పరమార్థమని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి,  సభ్యులు  విలువలతో కూడిన  ర్యాలీని కోటి సమితి దత్తత తీసుకున్న సుల్తాన్ బజార్, బడే చౌది లో నయా బజార్ గవర్నమెంట్, హై స్కూల్ లో, అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్, జండా ఊపి విలువలతో కూడిన నడకను ను ప్రారంభించారు. 

తొలుతగా కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, వేదం, సాయి గాయత్రీ మంత్రములను జపిస్తూ, కార్యక్రమము కొనసాగినది. అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్,  కోటి సమితి చేస్తున్న అనేక కార్యక్రమాలను అభినందిస్తూ ప్రతి ఒక్కరూవిలువలతో కూడిన నడవడికను పెంపొందించుకోవాలని అన్నారు. 

స్వామి వారి ప్రేమ ను 2022 డైరీ రూపంలో స్వామి చిర కాల భక్తులు శ్రీ శరత్ చంద్ర గారు అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్ గారికి బహకరించారు. 

ఈ కార్యక్రమములో బాలవికాస గురువులు, విద్యార్థులు, మహిళలు,   కూడా పాల్గొన్నారు. 

అందరినీ ప్రేమించు అందరినీ సేవించు, మానవసేవే మాధవసేవ, ఒకే భాష అదే హృదయ భాష ప్రదర్శించారు.

ఈ ప్రదర్శన కార్యక్రమము కందస్వామి లో గల షిరిడి బాబా దేవాలయంలో శ్రీ శ్రీ శరత్ చంద్ర గారు విద్యార్థుల నుద్దేశించి వాల్యూస్ గూర్చి విపులంగా పిల్లల కు అర్ధమయ్యే రీతిలో, రామయంలో లోని కధలు, మహాత్ముల జీవితాల విశేషాలలో మనం నేర్చుకోవలసిన అనేక విలువలను పిల్లలకు హత్తుకొనే విధముగా, తెలిపారు. 

ఈ నాటి కార్యక్రములో, బాలవికాస్ విద్యార్థులు, వారి తల్లితండ్రులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 




1 comment:

  1. WHATSAPP MESSAGE FROM T V SUBRAHMANYAM: SAIRAM 🙏 Beloved Sastry Garu, Excellent motivation, which is in need of the hour and as expected by BHAGAWAN BABA VARU. I’ll call you in the afternoon. SAIRAM 🙏 With loving regards, T V Subrahmanyam

    ReplyDelete