Saturday, December 4, 2021

BALVIKAS STUDENTS PERFORMING ABHISEKHAM ON 4-12-2021 THE LAST DAY OF KAARTEEKA MAASAM.

 

BALVIKAS STUDENTS PERFORMING ABHISEKHAM ON 4-12-2021 THE LAST DAY OF KAARTEEKA MAASAM. 









శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ  సమితి ఆధ్వర్యంలో, కార్తీక మాసం చివరి రోజు, శనివారం అమావాస్య, అనురాధ నక్షత్రంలో,  మధ్యాహ్నం 1- 15 నిమిషాల నుంచి, 2-00  గంటల వరకు, కోఠీ బాలవికాస్ విద్యార్థుల చేత, శ్రీ రుద్ర పారాయణం గావిస్తూ, అందరూ అభిషేకం చేసుకోవటం ఎంతో వైభవోపేతంగా ఈ కార్యక్రమం జి.పుల్లారెడ్డి బిల్డింగ్స్, 6వ అంతస్థులో గల శ్రీ సత్య సాయి సేవా సంస్థుల,  మందిర ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పిల్లలంతా ఎంతో శ్రావ్యంగా, ఉచ్చారణ దోషములు లేకుండా, వారి తల్లితండ్రులతో కలసి వచ్చి పాల్గొని , స్వామి ఆశీస్సులతో జరిగి, అందరూ తీర్ధ  ప్రసాదములు తీసుకొని స్వామి అనుగ్రహనికి పాత్రులైనారు.  ఈ రోజు అంటే కార్తీక  అమవాస్య నాడు అభిషేకం చేస్తే, కార్తీక మాసమంతా చేసిన పుణ్యం దక్కుతుందని, ఈ రోజు ఈ కార్యక్రమాన్నీ చేయ తలపెట్టినాము. 


ఈ కార్యక్రమంలో భాగంగా, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, బాల్ వికాస్ గురువు గారు, శ్రీమతి శైలి శ్వరి   గారు, బాల్ వికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి మహాలక్ష్మి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ రాము గారు, శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ మతి భువనేశ్వరి గారు, శ్రీ స్వామి యొక్క ఆశీస్సులతో  పాల్గొన్నారు. 


1 comment:

  1. ఓం శ్రీ సాయి శివాయ నమః 🙏.
    ఈ పసి బాల బాలికలందరికీ సాయిరాం🌹 అపర బ్రహ్మలుగా, మార్కండేయులుగా, ఎంతో భక్తి శ్రద్ధలతో కావిస్తున్న ఈ రుద్రఅభిషేకం, పరమశివుని మెప్పించే రీతిలో, ఎంతో క్రమశిక్షణతో, పవిత్రంగా కొనసాగుతోంది 🙏. ఎంతో అద్భుతంగా*నమక* పారాయణంతో, పెద్దలు ,భక్తులందరిచేత, అభిషేకం చేయించి, రిత్విక్కులకు మేము ఏమాత్రము తీసిపోము, అన్నట్లుగా, కన్నుల పండుగగా కనిపిస్తోంది. వారి క్రమశిక్షణ ,శ్రీరామరక్ష కావాలని, మనసా,వాచా, కర్మణా, స్వామివారిని ప్రార్థిస్తున్నాము 🙏.
    ఈ కార్యక్రమాన్ని, అందరికీ అందిస్తున్న, కోటి సమితి కన్వీనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదములు 🙏.
    This video is a model n will inspire n help the young generations,to grow in n healthy atmosphere,facing any kind of calamity, certainly *promote to prosperity

    ReplyDelete