Thursday, December 1, 2022

GEETA JAYANTHI VEDUKALU: 3-12-2022: KUNTAROAD HIGH SCHOOL, OSMAN GUNJ. HYD.

 














Report on dt 3-12-2022 గీతా జయంతి వేడుకలు

 ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి  ఆధ్వర్యంలో ఈరోజు అనగా 3 డిసెంబర్,   2022న హైదరాబాద్, ఉస్మాన్ గంజ్ తోప్ ఖానా   మసీదుకు సమీపములో ఉన్న, గవర్నమెంట్ హై స్కూల్, కుంట రోడ్డు,నందుశ్రీ సత్య సాయి స్కూల్ బాలవికాస్, విద్యార్థులతో " గీతా జయంతి వేడుకలు కార్యక్రమము  శ్రీమతి రేణుక గారు, ముఖ్య అతిధి స్వామి చిరకాల భక్తులు శ్రీ శరత్ కృష్ణ పరాయత్తం  మరియు సమితి కన్వీనర్ శ్రీ పి విశ్వేశ్వర శాస్త్రి జ్యోతి ప్రకాశం గావించి, ప్రారంభించారు. 

 శ్రీమతి కన్నా రెడ్డి రేణుక గారు,   గత రెండు నెలల నుండి నేర్పిన శ్లోకాలు విద్యార్థులు " నహి జ్ఞానేన సద్రృశం పవిత్ర మిహ విద్యతే - తత్ స్వయం యోగ సంసిద్దః కాలేనాత్మని విన్దతి. అనే శ్లోకలనుఎంతో భక్తి శ్రద్దలతో ఏకకంఠంతో ఈ పవిత్ర గీతా జయంతి వేడుకల సందర్భంగా,   వినిపించి, గురుదక్షిణగా  ఇచ్చారు.   

 ముఖ్య అతిధి, స్వామి చిరకాల భక్తులు శ్రీ శరత్ కృష్ణ పరాయత్తం, శ్రీ సత్య సాయి బాలవికాస్  గ్రూప్ - I లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రశంసా పత్రములను బహుకరించిన అనంతరం వారు  మాట్లాడుతూ, శ్రీ సత్య సాయి సేవా  సంస్థలు కోటి సమితి చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమము, ఎంతగానో కొనియాడుతూభగవద్గీత  ప్రాముఖ్యతను, విద్యార్థుల స్థాయిలో విశదీకరించిభగవద్గీతలో  అన్నిభాషలలో వున్నదని, అన్ని దేశాలలో ఈ రోజు గీతా జయంతి జరుపువుకున్నారని, మనము కూడా ఎంతో అదృష్టవంతులమని  మనము కూడా రోజు  భగవత్ గీత ఒక్క శ్లోకము చదివి దాని భావాన్ని తెలుసుకొని, మన నిత్యజీవితములో అనుసరించవనేనని తెలిపారు. అందరితో ఈ శ్లోకాన్ని వల్లెవేయించారు.  అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ । నిర్మమో నిరహంకారః సమదుఃఖసుఖః క్షమీ ।।

 ఈ కార్యక్రమంలో, శ్రీమతి విజయ లక్ష్మి , శ్రీమతి కల్పనా, శ్రీమతి సునీత,   హై స్కూల్ ప్రిన్సిపాల్, శ్రీ కె. శశికళ గారుశ్రీ దార సింగ్ గారు  శ్రీ వి నాగేశ్వర రావు  పాల్గొన్నారు సాయిరాం 

  

కన్వీనర్ 

పి . విశ్వేశ్వర శాస్త్రి. 



No comments:

Post a Comment