ఓం శ్రీ సాయిరాం
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి, 158 వ జయంతి సందర్భంగా, తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని, ఈనెల, అనగా ఆగస్టు, 28 ఇది 29 తేదీలలో, జరుపుకోవాలని, సంకల్పించుకుని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి బాలవికాస్ విద్యార్థులకు, 28న, మరియు, ఇతర విద్యార్థులకు, 29న, శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి, విశేషాలను, వారు చేసిన, అనేక సేవలను, కొనియాడుతూ, ప్రతి విద్యార్థి, ఐదు నిమిషాలకు, మించకుండా, మాట్లాడి, స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొంద ప్రార్థన. ఈ కార్యక్రమంలో, తెలుగు భాష, తీయదనాన్ని, తెలిపే, పాటలను, పద్యాలను, కూడా, పాడ వచ్చును. ఈ కార్యక్రమం, నిర్విఘ్నంగా, జరిగే విధంగా, స్వామిని ప్రార్థిస్తూ, బాలవికాస్ గురువులు, బాలవికాస్ ఇంచార్జి, మహిళా ఇంచార్జి, అందరూ కూడా, పిల్లలను, ప్రోత్సహించి, కార్యక్రమంలో పాల్గొనే విధంగా, సహకరించ వలసిందిగా, సవినయంగా, కోరుతున్నాను. జై సాయిరాం.
19వ శతాబ్ది రెండోభాగం; బ్రిటిష్ పాలన క్రమంగా మనదేశమంతటా స్థిరపడుతున్నది. సంప్రదాయానికి, ఆధునికతకు ఘర్షణ ఏర్పడుతున్న సంధికాలం అది. ఆంగ్లేయుల విజ్ఞానశాస్త్రాలు, రాజకీయభావాలు, సంస్కృతి సాహిత్యాలు, భారతీయమేధావులను ఎందరినో ప్రభావితం చేశాయి. ఆ ఫలితంగా చాలామంది స్వాతంత్ర్యసంగ్రామంలో దూకారు. కొందరు సంపన్నులు ఇంగ్లీషుచదువుల్లో తెల్లదొరలకు దీటుగా ఉండాలని ఐ. సీ. ఎస్. చదువుకు లండన్ నగరానికి, పై చదువులకు ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు. మరికొందరు సమాజసంస్కరణే జీవిత లక్ష్యంగా దేశంలోనే వుండి ఉద్యమాలు లేవదీసారు.
తెలుగుదేశంలో ముగ్గురు మహనీయులు పందొమ్మిదోశతాబ్ది రెండోభాగంలో ఉద్యమకర్తలై సమాజానికి ఎంతో సేవ చేశారు - కందుకూరి వీరేశలింగం (1840-1919), గురజాడ వెంకట అప్పారావు (1861-1915), గిడుగు వెంకట రామమూర్తి (1863-1940). బాల్యవివాహాలు, ముసలివాళ్ళు చిన్నపిల్లలను పెండ్లి చేసుకోవటం, మరణించిన భర్తతో బలవంతంగా భార్యను సహగమనం చేయించటం (సతీసహగమనం), వితంతువివాహాన్ని నిషేధించటం, ఆడపిల్లల్ని అమ్ముకోవటం (కన్యాశుల్కం), అస్పృశ్యత, వేశ్యాలోలుపత్వం — ముఖ్యంగా అగ్రవర్ణాలలో ఉన్న మూఢవిశ్వాసాలు, మూఢాచారాల్లో కొన్ని. తన రచనల ద్వారా, వీటిని నిర్మూలించి సంఘంలో అభ్యుదయభావాలను, నూతనచైతన్యాన్ని తేవటానికి వీరేశలింగంగారు అవిశ్రాంతకృషి చేశారు. చాలావరకు కృతకృత్యులైనారు కూడా. ఉదాత్తశిల్పంతో సృజనాత్మకరచనల (కథానికలు, కన్యాశుల్కం, ముత్యాలసరాలు) ద్వారా సమాజంలో ఉన్న దురాచారాలను చిత్రించి సమాజాన్ని మరమ్మత్తు చేయటంతో పాటు ఆధునిక సాహిత్యప్రక్రియలకు మార్గదర్శకుడైనాడు గురజాడ అప్పారావు. వ్యవహార భాషలో 1897లో ఆయన మొదటరచించిన కన్యాశుల్కం ఈనాటికీ గొప్పనాటకమే. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.
4. వచనభాషాసంస్కరణోద్యమం 1915-40
స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళగ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏరచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాసపాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆపత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారికభాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషాప్రవర్తకసమాజం” స్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతిమహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో Miscellany of Essays (వ్యాససంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. (?)1924లో కాకినాడలోని ఆంధ్రసాహిత్యపరిషత్తు ఆధికారికంగా వ్యావహారికభాషానిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్యపరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” అనే సాహిత్యపత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.
మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషావ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. గిడుగువారి సవరభాషాకృషికి మెచ్చి Kaizer-e-Hind పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు.
గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందారు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరిమాటలు -
“దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి.గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆభాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థంచేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?
గిడుగు రామమూర్తి 1940, జనవరి 22 న కన్ను మూశారు.
ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, మొదటి రోజు శ్రీ గిడుగు శ్రీ రామ్ మూర్తి గారి 158 వ జయంతి వేడుకలను కోటి సమితి బాలవికాస్ విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,
ఈ కార్యక్రమం, మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి గణపతి అధర్వ శీర్షం తో ప్రారంభమైనది. అనంతరం, మాస్టర్ లీలాధర్ శ్రీ దుర్గా సూక్తం, జయ గాయత్రీ నాగ చే శాంతి మంత్రం తో వేదం పఠనం సంపూర్ణమైనది.
ఈ కార్యక్రమంలో, బాలవికాస్ విద్యార్థులు అందరూ, భజనలను, ఎంతో శ్రావ్యంగా, ఆలపించి, స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు, పొందారు.
తదుపరి శ్రీ గిడుగు శ్రీ రాం మూర్తి గారి జీవిత విశేషాలను, తెలుగు వైభవాన్ని వర్ణిస్తూ,
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పద్యములను, వాటి భావమును యెంతో విపులముగా
మాస్టర్ లీలాధర్, శ్రీ సత్య సాయి భద్ర దేవి, మాస్టర్ హేమాంగ్, చిరంజీవి జయ గాయత్రీ నాగ, మాస్టర్ సాయి, మాస్టర్ నాగ, మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి వివరించారు. పెద్దలు కూడా భజనలో పాల్గొన్నారు.
శ్రీమతి ఏ సీతామహాలక్ష్మి, బాలవికాస్ ఇంచార్జి మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి గారి 158వ జయంతి ఉత్సవాలలో భాగంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమితి, రేపు కూడా నిర్వహిస్తున్నట్లు, అందరికి తెలియజేస్తూ 29వ తేదీ నాడు, సత్యసాయి ప్రోత్సాహక పురస్కార గ్రహీతలు,( కోటి సమితి) 24 మంది లో కొంత మంది పాల్గొంటారు. ఈ మధ్యనే రేడియో సాయి దశమ వార్షికోత్సవం సందర్భంగా, చిరు నాటికల ద్వారా, పరిచయమైన, 10 మంది విద్యార్థులు, కూడా పాల్గొనే దిశగా, అందరికి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారు, ప్రముఖులు, పాల్గొననున్నారు.
శ్రీమతి శ్రీ సీత మహాలక్ష్మి గారు స్వామి వారికీ ధన్యవాదములు తెలియజేశారు.
కన్వీనర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఉత్సవాలు భాషా దినోత్సవ వేడుకలను, ఏరకంగా ఎక్క ఎక్కడ నిర్వహించామో, స్ఫూర్తి ప్రదాతలకు ధన్యవాదములు తెలియ జేసినారు.
అందరూ కలిసి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం మనం దిగ్విజయంగా ముగిసింది.
40 భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.
శ్రీ గిడుగు రామమూర్తి గారి జయంతి శుభాకాంక్షలు మరియు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు ఏ దేశమేగినా ఎందు కాలిడినా సంస్కృతము తర్వాత ఆ దేవదేవుడైన, పరమేశ్వరుడే మెచ్చిన తెలుగు భాషను దేవ భాష గా గౌరవిద్దాం పూజిద్దాం తెలుగులోనే మాట్లాడదాం, తెలుగు భాషను ప్రోత్సహిద్దాం ప్రోత్సహిద్దాం జై సాయిరాం
ReplyDeleteవెంకట సత్య సాయి సూర్య భువనేశ్వరి వరిగొండ
ReplyDelete