Saturday, August 21, 2021

22-8-2021 Shravana Poornima - HAPPY శ్రావణ పూర్ణిమ

శ్రావణ పూర్ణిమ




శ్రావణ పూర్ణిమ అంటే "రక్ష" కట్టుకోవడం ఒకటే కాదు...దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని "విద్యాప్రదమైన""హయగ్రీవ" అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే.
అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.
మనిషికి ప్రధానమైనది జ్ఞానం...జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు...శాస్త్రాలకు మూలం వేదం.
ఆ వేదాన్ని లోకానికి అందించిన అవతారం "హయగ్రీవ" అవతారం.
జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది.
వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు.
ఆతరువాత వేద అంగములైన శిక్షా , వ్యాకరణం , నిరుక్తం , కల్పకం , చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు.
భగవంతునికి లోకంపై ఉండే కరుణ చేత నామ రూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామ రూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ "బ్రహ్మ"కు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేసాడు.
అయితే వేదం అనేది జ్ఞానం....
అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది , అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది.
బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్న అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు ఎన్నో సార్లు. భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు.
మశ్చావతారం , హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే.
చాలా సార్లు ఇచ్చినా కోల్పోయాడు...
శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో. ఉపదేశం చేసి చూసాడు. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు.
మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే
"ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః"
చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు, అవి మనల్ని రక్షించేవి కనుక.... వాటిని చెప్పేవి "శాస్త్రాలు" అయ్యాయి.
శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు.
బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుండి....
శ్రావణ పూర్ణిమనాడు భగంతుడు "గుఱ్ఱపుమెడ" కలిగిన ఆకృతిలో వచ్చి...గుఱ్ఱం యొక్క "సకిలింత" ద్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేసాడు.
🙏 హయగ్రీవ సంపాద స్తోత్రం 🙏
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముచ్చంతి పాపాని దరిద్ర్యమివ యోషితః!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః!!
శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం!!
(సేకరణ)
నూతన యజ్ఞోపవీత ధారణ విధానము . జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. . ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || . గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || . అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) . ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః, 13. ఓం సంకర్షణాయనమః, 14. ఓం వాసుదేవాయనమః, 15. ఓం ప్రద్యుమ్నాయనమః, 16. ఓం అనిరుద్ధాయనమః, 17. ఓం పురుషోత్తమాయనమః, 18. ఓం అధోక్షజాయనమః, 19. ఓం నారసింహాయనమః, 20. ఓం అత్యుతాయనమః, 21. ఓం జనార్దనాయనమః, 22. ఓం ఉపేంద్రాయనమః, 23. ఓం హరయేనమః, 24. ఓం శ్రీకృష్ణాయనమః. అని నమస్కరించవలెను. అటు పిమ్మట: . భూతోచ్చాటన: (చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.) ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః . (ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్) . గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను. ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్|| . తదుపరి సంకల్పం: మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే . (బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు) . యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను. . యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా, దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః || . "ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః " అని చెప్పి అని ధరించవలెను. . (మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.) . ద్వితీయోపవీత ధారణం: తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను. . తృతీయ యజ్ఞోపవీత ధారణం: తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను. . చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట: తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను. . తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును) . గాయత్రీ మంత్రము: “ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ " . తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను. . జీర్ణోపవీత విసర్జనం: తిరిగి ఆచమనం చేసి . శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే || . శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం జీర్నోపవీతం విసృజంతు తేజః || . శ్లో: ఏతా వద్దిన పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా జీర్ణత్వాత్తే పరిత్యాగో గచ్ఛ సూత్ర యథా సుఖం || . విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను. తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను. . తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను. . నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు: జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను 🍎🍎🍎సర్వం శివసంకల్పం🍎🍎🍎

Gayatri Mantra promotes the acquisition of Daiva Shakti, Divine Power. - Baba
The Gayatri is the Universal Prayer enshrined in the Vedas, the most ancient scriptures of man. The Gayatri is usually repeated at dawn, noon, and dusk. But God being beyond time, it is a result of our limitations that we talk of dawn and dusk. When we move away from the Sun it is dusk; when we move into the light of the Sun it is dawn. So you need not be bound by the three points of time to recite the prayer. It can be repeated always and everywhere, only one has to ensure that the mind is pure. I would advise you, young people, to recite it when you take your bath. Do not sing cheap and defiling film songs. Recite the Gayatri. When you bathe, the body is being cleansed; let your mind and intellect also be cleansed. Make it a point to repeat it when you bathe as well as before every meal, also when you wake from sleep and when you go to bed. Moreover, repeat 'Shanti' thrice at the end, for that repetition will give peace to three entities in you - body, mind, and soul.

Divine Discourse, Jun 20, 1977

No comments:

Post a Comment