Saturday, August 28, 2021

29-8-2021 OMKAARAM, SUPRABHATAM. VEDAM PRABHATA SANKEERTHANA -

 





 భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  దివ్య అనుగ్రహ ఆసిస్సులతో,

 శ్రీ సత్య సాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో
 ఘనంగా అమెజాన్ చైమ్ ద్వారా, ఆన్లైన్ ప్రభాత  సంకీర్తన
 ఈ రోజు అనగా 29-8-201 న  ఆదివారం 
 ఉదయం 5 గంటల నుండి 6 గంటలవరకు 
 అత్యంత భక్తి శ్రద్దలతో  జరిగినది. 

50 గురు  పాల్గొన్నారు   భజనలు  పాడుకున్నాము  

మా  అందరి ప్రార్ధన ఒక్కటే - సమస్తలోకా  సుఖినోభన్తు

21 ఓంకారం, సత్యసాయి భగవానుని సుప్రభాతంలో మొదలైన (నగర ) సంకీర్తన గణేశా, గురు, మాత భజనలతో సాగి, అందరూ భజనలు పాడి, స్వామి ధ్యానములోనుండి, ధన్యులైనారు. 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది. 


Thursday, August 26, 2021

SRI GIDUGU VENKATA RAM MURTHY 158 JAYANTHI - TELUGU BHASHA DINOSTAVAM. 28TH AND 29TH AUGUST, 2021

 

ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి, 158 వ జయంతి సందర్భంగా, తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని, ఈనెల, అనగా ఆగస్టు, 28 ఇది 29 తేదీలలో, జరుపుకోవాలని, సంకల్పించుకుని, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి బాలవికాస్ విద్యార్థులకు, 28న, మరియు, ఇతర విద్యార్థులకు, 29న, శ్రీ గిడుగు వెంకట రామమూర్తి గారి,  విశేషాలను, వారు చేసిన, అనేక సేవలను, కొనియాడుతూ, ప్రతి విద్యార్థి, ఐదు నిమిషాలకు, మించకుండా, మాట్లాడి, స్వామి దివ్య అనుగ్రహ ఆశీస్సులు పొంద ప్రార్థన. ఈ కార్యక్రమంలో, తెలుగు భాష, తీయదనాన్ని, తెలిపే, పాటలను, పద్యాలను, కూడా, పాడ వచ్చును. ఈ కార్యక్రమం, నిర్విఘ్నంగా, జరిగే విధంగా, స్వామిని ప్రార్థిస్తూ, బాలవికాస్ గురువులు, బాలవికాస్ ఇంచార్జి, మహిళా ఇంచార్జి, అందరూ కూడా, పిల్లలను, ప్రోత్సహించి, కార్యక్రమంలో పాల్గొనే విధంగా, సహకరించ వలసిందిగా, సవినయంగా, కోరుతున్నాను. జై సాయిరాం. 


19వ శతాబ్ది రెండోభాగం; బ్రిటిష్‌ పాలన క్రమంగా మనదేశమంతటా స్థిరపడుతున్నది. సంప్రదాయానికి, ఆధునికతకు ఘర్షణ ఏర్పడుతున్న సంధికాలం అది. ఆంగ్లేయుల విజ్ఞానశాస్త్రాలు, రాజకీయభావాలు, సంస్కృతి సాహిత్యాలు, భారతీయమేధావులను ఎందరినో ప్రభావితం చేశాయి. ఆ ఫలితంగా చాలామంది స్వాతంత్ర్యసంగ్రామంలో దూకారు. కొందరు సంపన్నులు ఇంగ్లీషుచదువుల్లో తెల్లదొరలకు దీటుగా ఉండాలని ఐ. సీ. ఎస్‌. చదువుకు లండన్‌ నగరానికి, పై చదువులకు ఆక్స్ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయాలకు వెళ్ళారు. మరికొందరు సమాజసంస్కరణే జీవిత లక్ష్యంగా దేశంలోనే వుండి ఉద్యమాలు లేవదీసారు.

తెలుగుదేశంలో ముగ్గురు మహనీయులు పందొమ్మిదోశతాబ్ది రెండోభాగంలో ఉద్యమకర్తలై సమాజానికి ఎంతో సేవ చేశారు - కందుకూరి వీరేశలింగం (1840-1919), గురజాడ వెంకట అప్పారావు (1861-1915), గిడుగు వెంకట రామమూర్తి (1863-1940). బాల్యవివాహాలు, ముసలివాళ్ళు చిన్నపిల్లలను పెండ్లి చేసుకోవటం, మరణించిన భర్తతో బలవంతంగా భార్యను సహగమనం చేయించటం (సతీసహగమనం), వితంతువివాహాన్ని నిషేధించటం, ఆడపిల్లల్ని అమ్ముకోవటం (కన్యాశుల్కం), అస్పృశ్యత, వేశ్యాలోలుపత్వం — ముఖ్యంగా అగ్రవర్ణాలలో ఉన్న మూఢవిశ్వాసాలు, మూఢాచారాల్లో కొన్ని. తన రచనల ద్వారా, వీటిని నిర్మూలించి సంఘంలో అభ్యుదయభావాలను, నూతనచైతన్యాన్ని తేవటానికి వీరేశలింగంగారు అవిశ్రాంతకృషి చేశారు. చాలావరకు కృతకృత్యులైనారు కూడా. ఉదాత్తశిల్పంతో సృజనాత్మకరచనల (కథానికలు, కన్యాశుల్కం, ముత్యాలసరాలు) ద్వారా సమాజంలో ఉన్న దురాచారాలను చిత్రించి సమాజాన్ని మరమ్మత్తు చేయటంతో పాటు ఆధునిక సాహిత్యప్రక్రియలకు మార్గదర్శకుడైనాడు గురజాడ అప్పారావు. వ్యవహార భాషలో 1897లో ఆయన మొదటరచించిన కన్యాశుల్కం ఈనాటికీ గొప్పనాటకమే. ఆధునిక విజ్ఞాన వ్యాప్తికి, వచనరచనకు కావ్యభాష పనికిరాదనీ, సామాన్యజనానికి అర్థమయ్యే సమకాలీన “శిష్టవ్యావహారికం”లో ఉండాలనీ ఆనాటి సాంప్రదాయికపండితులతో హోరాహోరీగా యుద్ధంచేసి ఆధునికప్రమాణభాషను ప్రతిష్టించటానికి మార్గదర్శకుడైనవాడు గిడుగు రామమూర్తి.




గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగస్టు 29వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ఉన్న పర్వతాలపేట అనే గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి) గా పనిచేస్తుండేవారు. 1857 దాకా ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రిగారు చోడవరం బదిలీ అయి అక్కడే విషజ్వరంతో 1875 లోనే చనిపోయారు. విజయనగరంలో మేనమామగారి ఇంట్లో ఉంటూ రామమూర్తి మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో ప్రవేశించి 1879లో మెట్రిక్యులేషన్‌ పరీక్ష ప్యాసయ్యారు. ఆ రోజుల్లో గురజాడ అప్పారావు రామమూర్తికి సహాధ్యాయి. ఆ ఏడే ఆయనకు పెండ్లి కూడా అయింది. 1880లో ముప్ఫై రూపాయల జీతం మీద పర్లాకిమిడీరాజావారి స్కూల్లో ఫస్టుఫారం లో చరిత్ర బోధించే అధ్యాపకుడైనాడు. సంసారబాధ్యత (తల్లి, ఇద్దరు చెల్లెళ్ళు) రామమూర్తిపై బడింది. ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ., 1894లో బి.ఏ. మొదటిరెండుభాగాలు, 1896లో మూడోభాగం ప్యాసై పట్టం పుచ్చుకున్నారు. ఇంగ్లీషు, సంస్కృతాలు గాక, ప్రధానపాఠ్యాంశంగా చరిత్ర తీసుకుని రాష్ట్రంలో ఫస్టుక్లాసులో, రెండోర్యాంకులో ఉత్తీర్ణులైనారు. రాజావారి హైస్కూలు కాలేజి అయింది. అప్పుడు ఆయనకు కాలేజి తరగతులకు పాఠాలు చెప్పే యోగ్యత వచ్చింది.

ఆరోజుల్లోనే ఆయనకు దగ్గర అడవుల్లో ఉండే సవరల భాష నేర్చుకొని వాళ్ళకు చదువు చెప్పాలనే కోరిక కలిగింది. తెలుగు సవరభాషలు రెండూ వచ్చిన ఒక సవర వ్యవహర్తను ఇంట్లోనే పెట్టుకొని సవర భాష నేర్చుకున్నారు. ఈపరిశ్రమ చాలా ఏళ్ళు జరిగింది. సవరభాషలో పుస్తకాలు రాసి సొంతడబ్బుతో స్కూళ్ళుపెట్టి అధ్యాపకుల జీతాలు చెల్లించి సవరలకు వాళ్ళభాషలోనే చదువుచెప్పే ఏర్పాట్లు చేశారు. మద్రాసుప్రభుత్వం వారు ఈకృషికి మెచ్చి 1913లో “రావ్‌ బహదూర్‌” బిరుదు ఇచ్చారు. భాషాశాస్త్రంలో అప్పుడప్పుడే వస్తున్న పుస్తకాలు చదివి వ్యాకరణనిర్మాణ విధానం నేర్చుకొన్నారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్ని, 1936లో సవర-ఇంగ్లీషు కోశాన్ని నిర్మించారు. సవర దక్షిణ ముండా భాష. మనదేశంలో మొట్టమొదట ముండా ఉపకుటుంబభాషను శాస్త్రీయంగా పరిశీలించినవాడు గిడుగు రామమూర్తి. ఆస్ట్రో-ఏషియాటిక్‌ భాషాకుటుంబంలో ఒక శాఖ ముండాభాషలు. ఆర్యభాషా వ్యవహర్తలు మనదేశానికి రాకముందు (క్రీ.పూ. 15వ శతాబ్ది) నుంచి వీళ్ళు మనదేశంలో స్థిరపడ్డారు. వీరిని “శబరు”లనే ఆదిమజాతిగా ఐతరేయబ్రాహ్మణం (క్రీ.పూ. 7వశతాబ్ది) లో పేర్కొన్నారు. హైస్కూల్లో చరిత్రపాఠం చెప్పేరోజుల్లోనే దగ్గరలో ఉన్న ముఖలింగదేవాలయాల్లో ఉన్న శాసనాల లిపిని స్వతంత్రంగా నేర్చుకుని చదివారు. విషయపరిశోధన చేసి వాటి ఆధారంగా ఎన్నో చారిత్రకాంశాలు, ముఖ్యంగా గాంగవంశీయులను గురించి రామమూర్తి ఇంగ్లీషులో ప్రామాణికవ్యాసాలు రాసి Indian Antiquary లోనూ Madras Literature and Science Society Journal లోనూ ప్రచురించారు. 1911లో గిడుగువారు 30 ఏళ్ళ సర్వీసు పూర్తికాగానే అధ్యాపకపదవి నుంచి స్వచ్ఛందంగా రిటైరయారు. అంతకుముందు కొద్ది సంవత్సరాల ముందే ఆధునికాంధ్రభాషాసంస్కరణ వైపు ఆయన దృష్టి మళ్ళింది.

4. వచనభాషాసంస్కరణోద్యమం 1915-40

స్కూలు కాలేజీ పుస్తకాల్లో గ్రాంథికభాషే పాతుకుపోయింది; కొన్నిటిలో వీరేశలింగంగారు ప్రతిపాదించిన సరళగ్రాంథికం కూడా వచ్చింది. గిడుగు రామమూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏరచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించాడు. 1919లో గిడుగు “తెలుగు” అనే మాసపత్రికను స్థాపించి తన శాస్త్రీయ వ్యాసాలతో, ఉపన్యాసపాఠాలతో అవిశ్రాంతంగా పోరాటం సాగించాడు. కాని ఆపత్రిక ఒక ఏడాది మాత్రమే నడిచింది. చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి, వీరేశలింగం, పంచాగ్నుల ఆదినారాయణశాస్త్రి, వజ్ఝల చినసీతారామశాస్త్రి మొదలైన కవులు, పండితులు వ్యావహారికభాషావాదం వైపు మొగ్గు చూపారు. 1919 ఫిబ్రవరి 28న రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం అధ్యక్షులుగా, గిడుగు కార్యదర్శిగా “వర్తమానాంధ్ర భాషాప్రవర్తకసమాజం” స్థాపించారు. 1933లో గిడుగు రామమూర్తి సప్తతిమహోత్సవం ఆయన అభిమానులు, శిష్యులు రాజమహేంద్రవరంలో బ్రహ్మాండంగా జరిపారు. తెలికచెర్ల వెంకటరత్నం సంపాదకుడుగా ప్రపంచం నలుమూలలనుంచి వచ్చిన 46 పరిశోధకవ్యాసాలతో Miscellany of Essays (వ్యాససంగ్రహం) అనే ఉద్గ్రంథాన్ని ఆయనకు సమర్పించారు. (?)1924లో కాకినాడలోని ఆంధ్రసాహిత్యపరిషత్తు ఆధికారికంగా వ్యావహారికభాషానిషేధాన్ని ఎత్తివేసింది. 1936లో నవ్యసాహిత్యపరిషత్తు అనే సంస్థను ఆధునికులు స్థాపించి సృజనాత్మకరచనల్లో శిష్టవ్యావహారికాన్ని ప్రోత్సహించే “ప్రతిభ” అనే సాహిత్యపత్రికను ప్రచురించారు. 1937లో తాపీ ధర్మారావుగారు సంపాదకులుగా “జనవాణి” అనే పత్రిక కేవలం ఆధునిక ప్రమాణభాషలోనే వార్తలు, సంపాదకీయాలు రాయటం మొదలుపెట్టింది.

మద్రాసు ప్రభుత్వం వారు గిడుగు ఆంగ్లంలో తయారుచేసిన సవరభాషావ్యాకరణాన్ని 1931లోను, సవర-ఇంగ్లీషు కోశాన్ని 1938లోను అచ్చువేశారు. గిడుగువారి సవరభాషాకృషికి మెచ్చి Kaizer-e-Hind పతకాన్ని ప్రభుత్వం వారు ఆయనకు అందజేశారు.

గిడుగు రామమూర్తి 1940 జనవరి 15వ తేదీన ప్రజామిత్ర కార్యాలయంలో పత్రికాసంపాదకులను సంబోధిస్తూ చేసిన తన తుదివిన్నపంలో వ్యావహారికభాషావ్యాప్తికి చాలా సంతృప్తి పొందారు. కాని, ప్రభుత్వ విద్యాశాఖవారు, విశ్వవిద్యాలయాలు గ్రాంథికాన్ని వదిలిపెట్టక పోవటానికి బాధపడ్డారు. ఆ విన్నపంలోని చివరిమాటలు -

“దేశభాష ద్వారా విద్య బోధిస్తేకాని ప్రయోజనం లేదు. శిష్టజనవ్యావహారికభాష లోకంలో సదా వినబడుతూంటుంది. అది జీవంతో కలకలలాడుతూ ఉంటుంది. గ్రాంథికభాష గ్రంథాలలో కనబడేదే కాని వినబడేది కాదు. ప్రతిమ వంటిది. ప్రసంగాలలో గ్రాంథికభాష ప్రయోగిస్తూ తిట్టుకొన్నా సరసాలాడుకున్నా ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో చూడండి.గ్రాంథికభాష యెడల నాకు ఆదరము లేకపోలేదు. ప్రాచీనకావ్యాలు చదువవద్దనీ విద్యార్థులకు నేర్పవద్దనీ నేననను. కాని ఆభాషలో నేడు రచన సాగించడానికి పూనుకోవడం వృథా అంటున్నాను. నిర్దుష్టంగా ఎవరున్ను వ్రాయలేరు. వ్రాసినా వ్రాసేవారికి కష్టమే వినేవారికి కష్టమే. వ్రాసేవాండ్లేమి చేస్తున్నారు? భావం తమ సొంత (వాడుక) భాషలో రచించుకొని గ్రాంథికీకరణం చేస్తున్నారు. అది చదివేవాండ్లు వినేవాండ్లు తమ సొంత వాడుకమాటలలోకి మార్చుకొని అర్థంచేసుకొంటున్నారు. ఎందుకీ వృథాప్రయాస?

“స్వరాజ్యం కావలెనంటున్నాము. ప్రత్యేకాంధ్రరాష్ట్రము కోసం చిక్కుపడుతున్నాము. ప్రజాస్వామికపరిపాలనం కోరుచున్నాము. ఇటువంటి పరిస్థితులలో మనప్రజలకు, సామాన్యజనులకు ఏభాష ద్వారా జ్ఞానం కలుగచేయవలసి ఉంటుందో, ఏ భాషలో గ్రంథరచన సాగించవలసి ఉంటుందో ఆలోచించండి. మీచేతులలో పత్రికలున్నవి. పత్రికల ద్వారా మీరు ఎంతైనా చేయగలరు”.
(From the Report submitted by the Telugu Language Committe to Andhra University, 1973: 99).

గిడుగు రామమూర్తి 1940, జనవరి 22 న కన్ను మూశారు.


PL CLICK HERE : 2021 SUPREME COURT CHIEF JUSTICE - SANDESHAM -  SRI GIDUGU SRI RAM MOORTHY JAYANTI 158TH CELEBRATIONS AND TELUGU BHASHA DINOSTAVA VEDUKALU 

 28-8-2021 : REPORT: 

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, మొదటి రోజు శ్రీ గిడుగు శ్రీ రామ్ మూర్తి గారి 158 వ జయంతి వేడుకలను కోటి సమితి బాలవికాస్ విద్యార్థులచే ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా జరిపించిన స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,

ఈ కార్యక్రమం, మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి గణపతి అధర్వ శీర్షం తో ప్రారంభమైనది. అనంతరం, మాస్టర్ లీలాధర్ శ్రీ దుర్గా సూక్తం, జయ గాయత్రీ నాగ చే శాంతి మంత్రం తో వేదం పఠనం సంపూర్ణమైనది.

ఈ కార్యక్రమంలో, బాలవికాస్ విద్యార్థులు అందరూ, భజనలను, ఎంతో శ్రావ్యంగా, ఆలపించి, స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు, పొందారు.

తదుపరి శ్రీ గిడుగు శ్రీ రాం మూర్తి గారి జీవిత విశేషాలను, తెలుగు వైభవాన్ని వర్ణిస్తూ,

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి పద్యములను, వాటి భావమును యెంతో విపులముగా

మాస్టర్ లీలాధర్, శ్రీ సత్య సాయి భద్ర దేవి, మాస్టర్ హేమాంగ్, చిరంజీవి జయ గాయత్రీ నాగ, మాస్టర్ సాయి, మాస్టర్ నాగ, మాస్టర్ ప్రాణవెండర్ రెడ్డి వివరించారు. పెద్దలు కూడా భజనలో పాల్గొన్నారు.

శ్రీమతి ఏ సీతామహాలక్ష్మి, బాలవికాస్ ఇంచార్జి మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి గారి 158వ జయంతి ఉత్సవాలలో భాగంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమితి, రేపు కూడా నిర్వహిస్తున్నట్లు, అందరికి తెలియజేస్తూ 29వ తేదీ నాడు, సత్యసాయి ప్రోత్సాహక పురస్కార గ్రహీతలు,( కోటి సమితి) 24 మంది లో కొంత మంది పాల్గొంటారు. ఈ మధ్యనే రేడియో సాయి దశమ వార్షికోత్సవం సందర్భంగా, చిరు నాటికల ద్వారా, పరిచయమైన, 10 మంది విద్యార్థులు, కూడా పాల్గొనే దిశగా, అందరికి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారు, ప్రముఖులు, పాల్గొననున్నారు.

శ్రీమతి శ్రీ సీత మహాలక్ష్మి గారు స్వామి వారికీ ధన్యవాదములు తెలియజేశారు.

కన్వీనర్ మాట్లాడుతూ గతంలో నిర్వహించిన గిడుగు రామ్మూర్తి గారి జయంతి ఉత్సవాలు భాషా దినోత్సవ వేడుకలను, ఏరకంగా ఎక్క ఎక్కడ నిర్వహించామో, స్ఫూర్తి ప్రదాతలకు ధన్యవాదములు తెలియ జేసినారు.

అందరూ కలిసి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం మనం దిగ్విజయంగా ముగిసింది.

40 భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.


PROGRAM LINK. 


Saturday, August 21, 2021

22-8-2021 Shravana Poornima - HAPPY శ్రావణ పూర్ణిమ

శ్రావణ పూర్ణిమ




శ్రావణ పూర్ణిమ అంటే "రక్ష" కట్టుకోవడం ఒకటే కాదు...దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని "విద్యాప్రదమైన""హయగ్రీవ" అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే.
అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.
మనిషికి ప్రధానమైనది జ్ఞానం...జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు...శాస్త్రాలకు మూలం వేదం.
ఆ వేదాన్ని లోకానికి అందించిన అవతారం "హయగ్రీవ" అవతారం.
జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది.
వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు.
ఆతరువాత వేద అంగములైన శిక్షా , వ్యాకరణం , నిరుక్తం , కల్పకం , చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు.
భగవంతునికి లోకంపై ఉండే కరుణ చేత నామ రూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామ రూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ "బ్రహ్మ"కు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేసాడు.
అయితే వేదం అనేది జ్ఞానం....
అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది , అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది.
బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్న అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు ఎన్నో సార్లు. భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు.
మశ్చావతారం , హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే.
చాలా సార్లు ఇచ్చినా కోల్పోయాడు...
శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో. ఉపదేశం చేసి చూసాడు. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు.
మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే
"ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః"
చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు, అవి మనల్ని రక్షించేవి కనుక.... వాటిని చెప్పేవి "శాస్త్రాలు" అయ్యాయి.
శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు.
బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుండి....
శ్రావణ పూర్ణిమనాడు భగంతుడు "గుఱ్ఱపుమెడ" కలిగిన ఆకృతిలో వచ్చి...గుఱ్ఱం యొక్క "సకిలింత" ద్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేసాడు.
🙏 హయగ్రీవ సంపాద స్తోత్రం 🙏
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముచ్చంతి పాపాని దరిద్ర్యమివ యోషితః!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః!!
శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం!!
(సేకరణ)
నూతన యజ్ఞోపవీత ధారణ విధానము . జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. . ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || . గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || . అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) . ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః, 13. ఓం సంకర్షణాయనమః, 14. ఓం వాసుదేవాయనమః, 15. ఓం ప్రద్యుమ్నాయనమః, 16. ఓం అనిరుద్ధాయనమః, 17. ఓం పురుషోత్తమాయనమః, 18. ఓం అధోక్షజాయనమః, 19. ఓం నారసింహాయనమః, 20. ఓం అత్యుతాయనమః, 21. ఓం జనార్దనాయనమః, 22. ఓం ఉపేంద్రాయనమః, 23. ఓం హరయేనమః, 24. ఓం శ్రీకృష్ణాయనమః. అని నమస్కరించవలెను. అటు పిమ్మట: . భూతోచ్చాటన: (చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.) ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః . (ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్) . గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను. ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్|| . తదుపరి సంకల్పం: మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే . (బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు) . యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను. . యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా, దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః || . "ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః " అని చెప్పి అని ధరించవలెను. . (మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.) . ద్వితీయోపవీత ధారణం: తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను. . తృతీయ యజ్ఞోపవీత ధారణం: తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను. . చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట: తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను. . తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును) . గాయత్రీ మంత్రము: “ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ " . తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను. . జీర్ణోపవీత విసర్జనం: తిరిగి ఆచమనం చేసి . శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే || . శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం జీర్నోపవీతం విసృజంతు తేజః || . శ్లో: ఏతా వద్దిన పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా జీర్ణత్వాత్తే పరిత్యాగో గచ్ఛ సూత్ర యథా సుఖం || . విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను. తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను. . తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను. . నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు: జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను 🍎🍎🍎సర్వం శివసంకల్పం🍎🍎🍎

Gayatri Mantra promotes the acquisition of Daiva Shakti, Divine Power. - Baba
The Gayatri is the Universal Prayer enshrined in the Vedas, the most ancient scriptures of man. The Gayatri is usually repeated at dawn, noon, and dusk. But God being beyond time, it is a result of our limitations that we talk of dawn and dusk. When we move away from the Sun it is dusk; when we move into the light of the Sun it is dawn. So you need not be bound by the three points of time to recite the prayer. It can be repeated always and everywhere, only one has to ensure that the mind is pure. I would advise you, young people, to recite it when you take your bath. Do not sing cheap and defiling film songs. Recite the Gayatri. When you bathe, the body is being cleansed; let your mind and intellect also be cleansed. Make it a point to repeat it when you bathe as well as before every meal, also when you wake from sleep and when you go to bed. Moreover, repeat 'Shanti' thrice at the end, for that repetition will give peace to three entities in you - body, mind, and soul.

Divine Discourse, Jun 20, 1977

96 MINUTES BALVIKAS PROGRAM. VEDAM BHAJAN ETC.,


                                                         
 



 ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహ అశీస్సులతో, స్వామివారి  శుక్రవారం   27-8-2021  రోజున ,స్వామి వారి 96 వ జన్మదినోత్సవ సందర్భముగా 96 నిమిషముల కార్యక్రమం బాల వికాస్ విద్యార్థులచే  నిర్వహించ దలచినాము.

కార్యక్రమ వివరాలు:-

1. ఓంకారం, గణపతి, సరస్వతి ప్రార్ధన. బాలవికాస్ విద్యార్థులచే

2 .స్వామి వారి అష్టోత్తర పూజ - బాలవికాస్ బాలికలచే

3. స్వామివారి పాదుకా స్తోత్రం బాలవికాస్ విద్యార్థులచే

4. వేదం: రుద్రం ఒకొక్క అనువాకం - ఒక విద్యార్థిచే

5. భజనలు - గణపతి,(2 )  గురు,(2 ) మాత (2 ) భజనలు  తరువాత్త అన్ని భజనలు---- 

6. అసతోమా..

7. స్వామి వారి సందేశం.

8. మంగళ హారతి.

9. విభూతి ప్రసాదం.

REPORT DT 27-8-2021

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, 96 నిమిషముల, బాలవికాస్ విద్యార్థుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినది. 

ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా  జరిపించిన  స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 

ఈ కార్యక్రమం, జ్యోతి ప్రకాశంతో, ప్రారంభమై, మూడు సార్లు ఓంకారం, గణపతి ప్రార్ధన సరస్వతి ప్రార్ధన, అనంతరం, భగవాన్ సత్యసాయి బాబా వారి అష్టోత్తర శతనామావళి, ఒకటి నుంచి 40 నామాలు, సత్యసాయి భద్రాదేవి, 40 నుండి 60 నామాలు, జయగాయత్రి నాగ, హేమాంగ్ - 60 నుంచి 80 నామాలను, చివరగా, ప్రణవెండర్ రెడ్డి 80 నుంచి 108 నామాలను, ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆలపిస్తూ  పూలతో, అక్షతలతో, వీడియో మోడ్ లో, లో పూజలు నిర్వహించారు. దీనితో పాటుగా, శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు, ఆలపించిన, శ్రీ సత్య సాయి  పాదుకా  అష్టోత్తరం, వింటూ, విద్యార్థులంతా, స్వామివారి, పాదాలకు పూజలు నిర్వహించారు. 

బాలవికాస్ విద్యార్థులు, వారికి కేటాయించిన, శ్రీ రుద్రం లోని 11 అనువాకము లు, ఎంతో భక్తితో, పఠించారు. 

ఈ కార్యక్రమంలో, పాల్గొన్న విద్యార్థులు అందరూ, వారికి వచ్చిన, అన్ని భజనలను, ఎంతో శ్రావ్యంగా, ఆలపించి, స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు, పొందారు. 

ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు, పెద్దలు, శ్రీ జగన్ మోహన్ రావు గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నిర్మల గారు, శ్రీ సువర్ణ  లక్ష్మి గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు, పొత్తూరి సీతామహాలక్ష్మి గారు, శ్యామల గారు, నెహ్రూ గారు, గురువులను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి సభ్యులను, అందరిని, ప్రశంసించి, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.

శ్రీమతి ఏ సీతామహాలక్ష్మి, బాలవికాస్ ఇంచార్జి  మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి గారి 158వ  జయంతి ఉత్సవాలలో భాగంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమితి, గత కొన్ని సంవత్సరాలుగా, నిర్వహిస్తున్నట్లు, అందరికి తెలియజేస్తూ,  ఈ కార్యక్రమాన్ని రేపు, మరియు ఎల్లుండి, అనగా 28,  29 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మొదటి రోజు అంటే 28వ తేదీ నాడు, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, 29వ తేదీ నాడు, సత్యసాయి ప్రోత్సాహక పురస్కార గ్రహీతలు,( కోటి సమితి) 24 మంది లో కొంత మంది పాల్గొంటారు. ఈ మధ్యనే  రేడియో సాయి  దశమ వార్షికోత్సవం సందర్భంగా, చిరు నాటికల ద్వారా, పరిచయమైన, 10 మంది విద్యార్థులు, కూడా పాల్గొనే దిశగా, అందరికి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారు, ప్రముఖులు, పాల్గొననున్నారు. 

చివరగా, శ్రీమతి శైలేశ్వరి గారు, ఎంతో భక్తి శ్రద్ధలతో, నేర్పిన రుద్రం, పిల్లలు కూడా శ్రద్ధగా నేర్చుకొని స్వామికి, సమర్పించారు. 

మహిళా ఇన్చార్జ్ విజయలక్ష్మి గారు, కల్పన గారు, మహాలక్ష్మి గారు, చల్ల మల్ల వెంకటలక్ష్మి రెడ్డి గారు, పాల్గొన్నారు. 

చివరగా, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, దివ్య సందేశాన్ని, ముఖ్యంగా విద్యార్థులకు, మరియు తల్లిదండ్రులకు, మరియు బాలవికాస్ గురువులను, ఉద్దేశించిన, దివ్య సందేశాన్ని, వినిపించారు. 

చివరగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, లీలాధర్, భద్రాదేవి, ప్రణవ్, గాయత్రి, హేమాంగ్ , సాయి, నాగ, రశ్మిత, ధీమహి, సాయి గుప్త, శరణ్య, సాయి రూప, సాయి లక్ష్మి, ధనుంజయ్, మనస్వి, అందరూ ఎంతో, గురువులు నేర్పిన, క్రమశిక్షణతో, కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అందరూ కలిసి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం మనం దిగ్విజయంగా ముగిసింది.

55 భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. 


ప్రోగ్రాం లింక్ 


----00000---