Saturday, August 21, 2021

22-8-2021 Shravana Poornima - HAPPY శ్రావణ పూర్ణిమ

శ్రావణ పూర్ణిమ




శ్రావణ పూర్ణిమ అంటే "రక్ష" కట్టుకోవడం ఒకటే కాదు...దానితో పాటు సర్వ విద్యా స్వరూపుడైన భగవంతుని "విద్యాప్రదమైన""హయగ్రీవ" అనే అవతారం జరిగింది ఈ శ్రావణ పూర్ణిమ రోజే.
అందుకే ఈ రోజుకి అంత ప్రాధాన్యం.
మనిషికి ప్రధానమైనది జ్ఞానం...జ్ఞానానికి ఆధారం శాస్త్రాలు...శాస్త్రాలకు మూలం వేదం.
ఆ వేదాన్ని లోకానికి అందించిన అవతారం "హయగ్రీవ" అవతారం.
జ్ఞానం చెప్పే భగవంతునికి చెందిన వాటంతటికి రక్ష. ఆ కంకణ ధారణ అనేదే రక్షబంధనం అయ్యింది.
వేదం చదువుకునే వారందరూ శ్రావణ పూర్ణిమ నాడు ఆరంభంచేసి నాలుగు నెలలు వేదాధ్యయనం చేస్తారు.
ఆతరువాత వేద అంగములైన శిక్షా , వ్యాకరణం , నిరుక్తం , కల్పకం , చందస్సు మరియూ జ్యోతిష్యం అనే షడంగములను అధ్యయనం చేస్తారు.
భగవంతునికి లోకంపై ఉండే కరుణ చేత నామ రూపాలు లేని ఈ జీవరాశికి ఒక నామ రూపాన్ని ఇవ్వడానికి చతుర్ముఖ "బ్రహ్మ"కు ఆయనకు వేదాన్ని ఉపదేశం చేసాడు.
అయితే వేదం అనేది జ్ఞానం....
అది అప్పుడప్పుడు అహంకారాన్ని తెచ్చి పెడుతుంది , అహంకారం ఏర్పడి ఉన్న జ్ఞానాన్ని పోయేట్టు చేస్తుంది.
బ్రహ్మగారికి అట్లా ఇంత చేస్తున్న అనే అహంకారం ఏర్పడి వేదాన్ని కోల్పోయాడు ఎన్నో సార్లు. భగవంతుడు తిరిగి ఒక్కో రూపాన్ని ధరించి ఇస్తూ ఉండేవాడు.
మశ్చావతారం , హంసావతారం ఇలా ఆయన వేదాన్ని ఇవ్వడానికి వచ్చిన అవతారాలే.
చాలా సార్లు ఇచ్చినా కోల్పోయాడు...
శ్రావణ పూర్ణిమ నాడు హయగ్రీవ రూపంలో. ఉపదేశం చేసి చూసాడు. అప్పుడు బ్రహ్మ వేదాన్ని కోల్పోలేదు.
మన శాస్త్రాలు అంటే ఎంతో కాలంగా ఆచరించి పొందిన అనుభవాల సారాలు. అందుకే
"ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః"
చాలా కాలంగా చేసిన ఆచారములే ధర్మములు, అవి మనల్ని రక్షించేవి కనుక.... వాటిని చెప్పేవి "శాస్త్రాలు" అయ్యాయి.
శాస్త్రాలను బట్టి ఆచారాలు రాలేదు.
బ్రహ్మ కాంచీపురంలోని వరదరాజ స్వామి సన్నిదానంలో చేసిన హోమం నుండి....
శ్రావణ పూర్ణిమనాడు భగంతుడు "గుఱ్ఱపుమెడ" కలిగిన ఆకృతిలో వచ్చి...గుఱ్ఱం యొక్క "సకిలింత" ద్వని మాదిరిగా వేదాన్ని వేదరాశిని ఉపదేశం చేసాడు.
🙏 హయగ్రీవ సంపాద స్తోత్రం 🙏
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం
నరం ముచ్చంతి పాపాని దరిద్ర్యమివ యోషితః!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్!!
హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో ధ్వనిః
విశోభతే స వైకుంఠ కవాటోద్ఘాటనక్షమః!!
శ్లోకత్రయమిదం పుణ్యం హయగ్రీవ పదాంకితం
వాదిరాజ యతిప్రోక్తం పఠతాం సంపదాం పదం!!
(సేకరణ)
నూతన యజ్ఞోపవీత ధారణ విధానము . జంధ్యాల పౌర్ణమి శ్రావణ పౌర్ణమి నాడు వస్తుంది. ఈ రోజు జీర్ణమైన (పాత) జంధ్యమును తీసివేసి కొత్త జంధ్యమును (యజ్ఞోపవీతం) దరించవలెను. . ప్రార్థన: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం | ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే || . గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుః గురు దేవో మహేశ్వరః | గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై: శ్రీ గురవే నమః || . అపవిత్ర: పవిత్రోవా సర్వావస్థాం గతో 2పివా | యస్మరేత్ పుండరీకాక్షం న బాహ్యాభ్యంతరశ్సుచి: || పుండరీకాక్ష! పుండరీకాక్ష! పుండరీకాక్ష! (అంటూ తల పైకి నీళ్ళు చల్లుకొనవలెను) . ఆచమన విధానం: ఉద్ధరిణతో నీళ్ళు తీసుకొని, 1. ఓం కేశవాయ స్వాహా, 2. ఓం నారాయణాయ స్వాహా, 3. ఓం మాధవాయ స్వాహా, అని ప్రతిమంత్రమునకు ఒకమారు చొప్పున మూడుసార్లు ఆ నీటిని త్రాగ వలెను. తరువాత భగవంతునికి నమస్కరిస్తూ ఈ క్రింది కేశవ నామములను చదువ వలెను. 4. ఓం గోవిందాయనమః, 5. ఓం విష్ణవే నమః, 6. ఓం మధుసూదనాయనమః, 7. ఓం త్రివిక్రమాయనమః, 8. ఓం వామనాయనమః, 9. ఓం శ్రీధరాయనమః, 10. ఓం హృషీకేశాయనమః, 11. ఓం పద్మనాభాయనమః, 12. ఓం దామోదరాయనమః, 13. ఓం సంకర్షణాయనమః, 14. ఓం వాసుదేవాయనమః, 15. ఓం ప్రద్యుమ్నాయనమః, 16. ఓం అనిరుద్ధాయనమః, 17. ఓం పురుషోత్తమాయనమః, 18. ఓం అధోక్షజాయనమః, 19. ఓం నారసింహాయనమః, 20. ఓం అత్యుతాయనమః, 21. ఓం జనార్దనాయనమః, 22. ఓం ఉపేంద్రాయనమః, 23. ఓం హరయేనమః, 24. ఓం శ్రీకృష్ణాయనమః. అని నమస్కరించవలెను. అటు పిమ్మట: . భూతోచ్చాటన: (చేతిలో ఉద్ధరిణి తో నీరు పోసుకుని యీ క్రింది మంత్రమును చదివిన పిమ్మట భూమిపై నీళ్ళు జల్లవలెను.) ఉత్తిష్ఠంతు | భూత పిశాచాః | యే తే భూమిభారకాః | యే తేషామవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దేవీ గాయత్రీచ్చందః ప్రాణాయామే వినియోగః . (ప్రాణాయామం కృత్వా కుంభకే ఇమం గాయత్రీ మంత్రముచ్ఛరేత్) . గృహస్తులు ఐదు వ్రేళ్లతో నాసికాగ్రమును పట్టుకొని మంత్రము చెప్పవలెను. బ్రహ్మచారులు బొటన వ్రేలి తో కుడి ముక్కును, అనామిక ఉంగరం వ్రేళ్లతో ఎడమ ముక్కును పట్టుకొని ఈ క్రింది మంత్రమును చెప్ప వలెను. ఓం భూః, ఓం భువః, ఓగ్ మ్ సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓగ్ మ్ సత్యం, ఓం తత్స వితుర్వరేణ్యం బర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ | ఓం ఆపో జ్యోతి రసో2మృతం, బ్రహ్మ భూర్భువస్సువరోమ్|| . తదుపరి సంకల్పం: మమ ఉపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, ఆద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీ శైలస్య ఈశాన్య ప్రదేశే, గంగా కావేరీయోర్మధ్యే, స్వగృహే (లేదా శోభన గృహే), సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల, పురుషార్ధ సిద్ధ్యర్ధం, ఆయుష్యాభివృద్ధ్యర్ధం, మమ శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన యోగ్యతా ఫల సిద్ధ్యర్ధం నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే . (బ్రహ్మచారులు “ధర్మపత్నీ సమేతస్య" అని చెప్పనక్కర లేదు) . యజ్ఞోపవీతములు ఐదింటిని ఐదు ముడుల వద్దను, మరి రెండు సమానదూర స్థలముల వద్దను, కుంకుమను తడి చేసి అలంకరించి అధిష్టాన దేవత అయిన గాయత్రిని ధ్యానించి, యజ్ఞోపవీత ధారణా మంత్రము స్మరించి ఈ క్రింది విధముగా ధరించవలెను. . యజ్ఞోప వీతే త్తస్య మంత్రస్య పరమేష్టీ పరబ్రహ్మర్షి: పరమాత్మా, దేవతా, దేవీ గాయత్రీచ్చందః యజ్ఞోపవీత ధారణే వినియోగః || . "ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్ ఆయుష్య మగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః " అని చెప్పి అని ధరించవలెను. . (మంత్ర పఠన సమయమున కుడి బాహువును పైకెత్తి శరీరము తగలకుండా జందెమును పట్టి యుంచి మంత్రాంతము నందు కుడిబాహువు మీదుగా ఎడమ బాహువు నందు ధరించవలెను.) . ద్వితీయోపవీత ధారణం: తిరిగి ఆచమనం చేసి “మమ నిత్యకర్మానుష్టాన యోగ్యతా సిద్ధ్యర్ధం ద్వితీయ యజ్ఞోపవీతధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని రెండవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను. . తృతీయ యజ్ఞోపవీత ధారణం: తిరిగి ఆచమనం చేసి “ఉత్తరీయార్ధం తృతీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే” అని మంత్రము చెప్పి పూర్వము వలె గాయత్రీ మంత్రము చెప్పుకొని మూడవ జందెమును పైన చెపిన విధముగా వేసికోనవలెను. . చతుర్ధ పంచమ యజ్నోపవీతములు ధరించుట: తిరిగి ఆచమనం చేసి పై మంత్రమును పఠిస్తూ "ఆపన్నివారణార్థం చతుర్థ, పంచమ యజ్ఞోపవీత ధారణం కరిష్యే" అని నాలుగు, ఐదు ముడులను ఒక దాని తరువాత మరి యొకటి దరించవలెను. మొత్తము ఐదు ముడులు వచ్చునట్లు సరిచేసుకొనవలెను. . తరువాత పాత, కొత్త జంధ్యములను కలిపి, కుడి చేతి బొటన వ్రేలు, చూపుడు వ్రేలు మధ్యలో పట్టుకొని పైన కండువా కప్పి, “దశ గాయత్రి” (పదిమారులు గాయత్రి మంత్రము) జపించి, “యధాశక్తి దశ గాయత్రీ మంత్రం గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీటిని వదలవలెను. (బ్రహ్మచారులు ఒక్క ముడినే ధరించవలయును) . గాయత్రీ మంత్రము: “ఓం భూర్భువస్సువః తత్ సవితుర్ వరేణ్యం భర్గో దేవస్య ధీ మహి ధియో యోనః ప్రచోదయాత్ " . తరువాత ఈ క్రింది విజర్జన మంత్రము చదువుతూ పాత జందెమును తీసి వేయవలెను. . జీర్ణోపవీత విసర్జనం: తిరిగి ఆచమనం చేసి . శ్లో: ఉపవీతం ఛిన్నతంతుం కశ్మల దూషితం విసృజామి యశో బ్రహ్మ వర్చో దీర్ఘాయురస్తుమే || . శ్లో: పవిత్రదంతా మతి జీర్ణవంతం వేదాంత వేద్యం పరబ్రహ్మ రూపం ఆయుష్య మగ్ర్యం ప్రతిమంచ శుభ్రం జీర్నోపవీతం విసృజంతు తేజః || . శ్లో: ఏతా వద్దిన పర్యంతం బ్రహ్మత్వం ధారితం మయా జీర్ణత్వాత్తే పరిత్యాగో గచ్ఛ సూత్ర యథా సుఖం || . విసర్జన సమయములో తీసివేస్తున్న పాత జందెమును పాదములకు తాకకుండా చూసుకోవలెను. తిరిగి ఆచమనం చేసి కొత్త యజ్ఞోపవీతముతో కనీసం పది సార్లు గాయత్రి మంత్రము జపింఛి యధాశక్తి "గాయత్రీ దేవతార్పణమస్తు" అని నీరు విడువ వలెను. ఆ తరువాత గాయత్రీ దేవికి నైవేద్యము సమర్పించి, ఆ ప్రసాదమునకు నమస్కరించి స్వీకరించవలెను. . తీసివేసిన పాత జందెమును ఏదైనా పచ్చని మొక్కపై వేయవలెను. . నూతన యజ్ఞోపవీత ధారణ సమయములు: జాతాశౌచ శుద్ధి యందు, మృతాశౌచ శుద్ధియందు, గ్రహణానంతరము, ప్రతి నాలుగు మాసముల అనంతరము నూతన యజ్ఞోపవీతమును ధరించి, పూర్వ యజ్ఞోపవీతమును త్యజించవలెను 🍎🍎🍎సర్వం శివసంకల్పం🍎🍎🍎

Gayatri Mantra promotes the acquisition of Daiva Shakti, Divine Power. - Baba
The Gayatri is the Universal Prayer enshrined in the Vedas, the most ancient scriptures of man. The Gayatri is usually repeated at dawn, noon, and dusk. But God being beyond time, it is a result of our limitations that we talk of dawn and dusk. When we move away from the Sun it is dusk; when we move into the light of the Sun it is dawn. So you need not be bound by the three points of time to recite the prayer. It can be repeated always and everywhere, only one has to ensure that the mind is pure. I would advise you, young people, to recite it when you take your bath. Do not sing cheap and defiling film songs. Recite the Gayatri. When you bathe, the body is being cleansed; let your mind and intellect also be cleansed. Make it a point to repeat it when you bathe as well as before every meal, also when you wake from sleep and when you go to bed. Moreover, repeat 'Shanti' thrice at the end, for that repetition will give peace to three entities in you - body, mind, and soul.

Divine Discourse, Jun 20, 1977

96 MINUTES BALVIKAS PROGRAM. VEDAM BHAJAN ETC.,


                                                         
 



 ఓం శ్రీ సాయిరాం

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా దివ్య అనుగ్రహ అశీస్సులతో, స్వామివారి  శుక్రవారం   27-8-2021  రోజున ,స్వామి వారి 96 వ జన్మదినోత్సవ సందర్భముగా 96 నిమిషముల కార్యక్రమం బాల వికాస్ విద్యార్థులచే  నిర్వహించ దలచినాము.

కార్యక్రమ వివరాలు:-

1. ఓంకారం, గణపతి, సరస్వతి ప్రార్ధన. బాలవికాస్ విద్యార్థులచే

2 .స్వామి వారి అష్టోత్తర పూజ - బాలవికాస్ బాలికలచే

3. స్వామివారి పాదుకా స్తోత్రం బాలవికాస్ విద్యార్థులచే

4. వేదం: రుద్రం ఒకొక్క అనువాకం - ఒక విద్యార్థిచే

5. భజనలు - గణపతి,(2 )  గురు,(2 ) మాత (2 ) భజనలు  తరువాత్త అన్ని భజనలు---- 

6. అసతోమా..

7. స్వామి వారి సందేశం.

8. మంగళ హారతి.

9. విభూతి ప్రసాదం.

REPORT DT 27-8-2021

ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, 96 నిమిషముల, బాలవికాస్ విద్యార్థుల కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినది. 

ఈ కార్యక్రమాన్నిదిగ్విజయంగా  జరిపించిన  స్వామికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, 

ఈ కార్యక్రమం, జ్యోతి ప్రకాశంతో, ప్రారంభమై, మూడు సార్లు ఓంకారం, గణపతి ప్రార్ధన సరస్వతి ప్రార్ధన, అనంతరం, భగవాన్ సత్యసాయి బాబా వారి అష్టోత్తర శతనామావళి, ఒకటి నుంచి 40 నామాలు, సత్యసాయి భద్రాదేవి, 40 నుండి 60 నామాలు, జయగాయత్రి నాగ, హేమాంగ్ - 60 నుంచి 80 నామాలను, చివరగా, ప్రణవెండర్ రెడ్డి 80 నుంచి 108 నామాలను, ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆలపిస్తూ  పూలతో, అక్షతలతో, వీడియో మోడ్ లో, లో పూజలు నిర్వహించారు. దీనితో పాటుగా, శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారు, ఆలపించిన, శ్రీ సత్య సాయి  పాదుకా  అష్టోత్తరం, వింటూ, విద్యార్థులంతా, స్వామివారి, పాదాలకు పూజలు నిర్వహించారు. 

బాలవికాస్ విద్యార్థులు, వారికి కేటాయించిన, శ్రీ రుద్రం లోని 11 అనువాకము లు, ఎంతో భక్తితో, పఠించారు. 

ఈ కార్యక్రమంలో, పాల్గొన్న విద్యార్థులు అందరూ, వారికి వచ్చిన, అన్ని భజనలను, ఎంతో శ్రావ్యంగా, ఆలపించి, స్వామివారి దివ్య అనుగ్రహ ఆశీస్సులు, పొందారు. 

ఈ కార్యక్రమంలో విద్యార్థులతోపాటు, వారి తల్లిదండ్రులు, పెద్దలు, శ్రీ జగన్ మోహన్ రావు గారు, శ్రీమతి భవాని గారు, శ్రీమతి నిర్మల గారు, శ్రీ సువర్ణ  లక్ష్మి గారు, శ్రీమతి అన్నపూర్ణ గారు, పొత్తూరి సీతామహాలక్ష్మి గారు, శ్యామల గారు, నెహ్రూ గారు, గురువులను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, కోటి సమితి సభ్యులను, అందరిని, ప్రశంసించి, స్వామి యొక్క దివ్య అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థించారు.

శ్రీమతి ఏ సీతామహాలక్ష్మి, బాలవికాస్ ఇంచార్జి  మాట్లాడుతూ, గిడుగు రామ్మూర్తి గారి 158వ  జయంతి ఉత్సవాలలో భాగంగా తెలుగు భాషా దినోత్సవ వేడుకలను, శ్రీ సత్యసాయి సేవా సంస్థలు సమితి, గత కొన్ని సంవత్సరాలుగా, నిర్వహిస్తున్నట్లు, అందరికి తెలియజేస్తూ,  ఈ కార్యక్రమాన్ని రేపు, మరియు ఎల్లుండి, అనగా 28,  29 తేదీల్లో రెండు రోజులపాటు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మొదటి రోజు అంటే 28వ తేదీ నాడు, కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, 29వ తేదీ నాడు, సత్యసాయి ప్రోత్సాహక పురస్కార గ్రహీతలు,( కోటి సమితి) 24 మంది లో కొంత మంది పాల్గొంటారు. ఈ మధ్యనే  రేడియో సాయి  దశమ వార్షికోత్సవం సందర్భంగా, చిరు నాటికల ద్వారా, పరిచయమైన, 10 మంది విద్యార్థులు, కూడా పాల్గొనే దిశగా, అందరికి తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో, శ్రీమతి ఆలూరి కళ్యాణి గారు, ప్రముఖులు, పాల్గొననున్నారు. 

చివరగా, శ్రీమతి శైలేశ్వరి గారు, ఎంతో భక్తి శ్రద్ధలతో, నేర్పిన రుద్రం, పిల్లలు కూడా శ్రద్ధగా నేర్చుకొని స్వామికి, సమర్పించారు. 

మహిళా ఇన్చార్జ్ విజయలక్ష్మి గారు, కల్పన గారు, మహాలక్ష్మి గారు, చల్ల మల్ల వెంకటలక్ష్మి రెడ్డి గారు, పాల్గొన్నారు. 

చివరగా, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి, దివ్య సందేశాన్ని, ముఖ్యంగా విద్యార్థులకు, మరియు తల్లిదండ్రులకు, మరియు బాలవికాస్ గురువులను, ఉద్దేశించిన, దివ్య సందేశాన్ని, వినిపించారు. 

చివరగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, లీలాధర్, భద్రాదేవి, ప్రణవ్, గాయత్రి, హేమాంగ్ , సాయి, నాగ, రశ్మిత, ధీమహి, సాయి గుప్త, శరణ్య, సాయి రూప, సాయి లక్ష్మి, ధనుంజయ్, మనస్వి, అందరూ ఎంతో, గురువులు నేర్పిన, క్రమశిక్షణతో, కార్యక్రమంలో పాల్గొన్నారు. 

అందరూ కలిసి, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారికి మంగళ హారతి సమర్పణతో కార్యక్రమం మనం దిగ్విజయంగా ముగిసింది.

55 భక్తులు ఈ కార్యక్రమములో పాల్గొన్నారు. 


ప్రోగ్రాం లింక్ 


----00000---


Friday, June 25, 2021

Reports 20-12-2020 to JUNE 2021

                                 Reports 20-12-2020  to JUNE 2021 


 List of Balvikas students Name & Surname  ( koti samithi);-
1. Mahankali Sai Rupa.- D/o Mahankali Lakshmi  Narsimha Rao.
2. Hemang Naga :-S/o Sunil Kumar Naga.
3.Jaya Gayathri Naga:-D/o Sunil Kumar Naga.
4 Jambula Pranavender Reddy:-S/o  Anantha Raja Reddy .
5.Gurthuru Leeladhar :-S/o  Gurthuru Naveen Kumar.
6.Mahankali Sai Gupta-:-S/o Mahankali Venkata Chakradhar Rao .
7.Mahankali Sharanya:-D/o Mahankali Venkata Chakradhar Rao.
8. Varigonda Sri Sathya Sai Bhadra Devi.:-D/o Varigonda Srinivas.
9. Poduru Sri Sathya Sai Bhadra Krishna.:-S/o Poduru M.K.K.Gandhi.
10.Poduru Naga Sathya Sri Krishna.:- S/o Poduru M.K.K.Gandhi.


సాయిరాం, ఈరోజు (5-12-2020)నా బాల్ వికాస్ క్లాస్ కి పిల్లలందరూ హాజరయ్యారు. బాలవికాస్ క్లాస్లో భగవద్గీత లోని 9,10 వ స్లో కాల ను ఉదాహరణలతో కొన్ని చిన్న కథలతో విశదీకరించారు. మరియు పిల్లలతో మొదటి 5 స్లో కాల్ అను చెప్పించాను. స్వామి అష్టోత్తరం లోని మొదటి 20 నామాలు పిల్లలు చూడకుండా చెప్పగలిగారు .జై సాయి రామ్.

 

Sairam, ఈరోజు (11-12-2020) బాలవికాస్ క్లాస్ 6 గంటల నుండి 7.30pm వరకు తీసుకున్నాను. ఈరోజు బాలవికాస్ క్లాసులో  ఒక పద్యం, దాని భావం వివరించాను. మరియు గాయత్రి మంత్రం యొక్క విశిష్టత, మంత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు , ఉదాహరణలతో, చిన్న కథలతో, మరియు మంత్ర జపం వల్ల కలిగే లాభాలను విశదీకరించాను. జై సాయిరాం.

ఈరోజు (11-12-2020) బాలవికాస్ క్లాస్ 6 గంటల నుండి 7.30pm వరకు తీసుకున్నాను. ఈరోజు బాలవికాస్ క్లాసులో  ఒక పద్యం, దాని భావం వివరించాను. మరియు గాయత్రి మంత్రం యొక్క విశిష్టత, మంత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు , ఉదాహరణలతో, చిన్న కథలతో, మరియు మంత్ర జపం వల్ల కలిగే లాభాలను విశదీకరించాను. జై సాయిరాం.

సాయిరామ్ అండి, ఈరోజు న (23-1-2021) బాలవికాస్ క్లాసులో నామస్మరణ, నామ సంకీర్తన, సత్సంగం మరియు కోన్ని మంచి అలవాట్ల గురించి  తెలియజేశాను.

సాయిరామ్ అండి, ఈరోజు బాలవికాస్ క్లాసులో (30-1-2021) నియమ పాలన, మృదు మధుర భాషణ గురించి తెలియ చేసి, ఒక చిన్న కథ  కూడా చెప్పాను. మరియు పూజ  విధానంలోని అంతరార్థాన్ని వాళ్ళకు అర్థమయ్యే విధంగా తెలియజేశాను ఈరోజు క్లాస్ కి  హేమంగ, గుప్తా, ప్రణవ్, లీలా ధర్ ,నాగ, సాయి, భద్రాదేవి, గాయత్రి, శరణ్య, పాల్గొన్నారు.ఓం శ్రీ సాయిరాం.

13-2-2021 సాయిరాం, ఈరోజు (13-2-21) బాలవికాస్ క్లాస్లో స్వామివారి  అష్టోత్తర నామాలు (40-50) వివరించి చెప్పాను. ఎట్టి కర్మ యు.... అనే పధ్యము చెప్పి వివరించాను. మరియు సంపూర్ణ శరణాగతి అనే కథను తెలిపాను. రోజు పిల్లలందరూ గాయత్రి మంత్రాన్ని చదువుతున్నారా లేదా తెలుసుకున్నాను. కల్పన గారు ఒక  భజన ని చెప్పారు.

14-2-2021  Coding Classes. సాయిరాం, ఈరోజు (14-2-21) మొదలుపెట్టిన  కోడింగ్ క్లాస్ కోచింగ్ లో మన బాల వికాస్ పిల్లలు (హేమంత్, గాయత్రి, లీల ధర్ ,ప్రణవ్, సాయి, నాగ) పాల్గొన్నారు.

20-2-2021 సాయిరాం, ఈరోజు బాలవికాస్ క్లాస్ లో కర్మ చేయగా నాకు హక్కు లేదు అనే పద్యం, మరియు పంచమాతలు గురించి తెలియజేశాను. రెండు కథలు చెప్పాను. ( హృదయం ఈశ్వర  మగ్నం -హస్తం కార్య మగ్నం ,మానవ సంకల్పం- దైవానుగ్రహం). పేపర్ తో వాచ్ చేయడం నేర్పించాను.ఇంకా గుప్తా, శరణ్య ,సాయి రూప ఈరోజు బాలవికాస్ క్లాస్ కి రాలేదు.

27-2-2021  సాయిరాం, ఈరోజు బాలవికాస్ క్లాస్ కి భద్రాదేవి ,గుప్తా శరణ్య, లీల ధర్, గాయత్రి, సాయి, నాగ పాల్గొన్నారు. ఈరోజు క్లాసులో నమ్మక మను రెండు  నయనంబులే లేని- అనే పద్యము, శివరాత్రి పండుగ గురించి, మరియు 2 కథలు- (దృష్టి- దృశ్యము) తెలియచేసి, పేపర్ తో పర్సు, స్మాల్ హాట్ తయారు చేయ డం చూపించాను. పిల్లలతో నాలుగు భగవద్గీత శ్లోకాలు మరియు 1- 30 అష్టోత్తర నామాలు చెప్పించాను.

13-3-2021 సాయిరాం, స్వామి వారి అనుగ్రహంతో  ఈరోజు(13-3-2021) బాలవికాస్ క్లాస్ కి హేమంత్, గాయత్రి ,లీల ధర, స్నిగ్ధ ,సాయి గుప్తా, శరణ్య, భద్రాదేవి, సాయి, నాగ పాల్గొన్నారు. ఈరోజు క్లాసులో లో స్వామి వారి అష్టోత్తర నామాలు (50-60), (కాగితము నందు కలిగిన అక్షరాలు) అనే పద్యం ని , మరియు బుద్ధ పౌర్ణిమ గురించి తెలియచేసి, సంకల్పబలం అనే కథని వివరించాను. కొన్ని వాక్య విభూతులను తెలియజేశాను

19-3-2021 సాయిరాం, స్వామి వారి అనుగ్రహంతో ఈరోజు బాలవికాస్ క్లాస్ కి (సాయి రూపా, హేమంత్, గాయత్రి , భద్ర దేవి, స్స్నిగ్ధ ,లీల ధర,) హాజరైనారు. ఈరోజు క్లాస్ లో స్వామి వారి హారతి గురించి , వివరించాను. మనసు స్వాధీనం అనే కథను, ఇనుప పాత్ర అయినను హేమ పాత్ర నైనను అనే పద్యమును తెలియచేసి పిల్లలందరితో పద్యాలు చెప్పించాను. రాస విలోల అనే భజన ని కల్పన గారు నేర్పించారు. (ప్రణవ్ ,సాయి ,నాగ, గుప్తా, శరణ్య, వీళ్లు క్లాస్ కి రాలేదు. ఇంకా కొన్ని వాక్య విభూతులను తెలియజేశాను.

10-4-2021 సాయిరాం, ఈరోజు (10-4-2021) బాలవికాస్ క్లాసులో సత్య సాయి బాబా వారి అష్టోత్తరాలు (60-70)  వివరించారు మరియు 1.గుణము కొంచెం నుండి గొప్ప చదువులు ఉన్న, 2. జాతి గౌరవములు అనే రెండు పద్యాలను వివరించి తెలియజేశాను. పిల్లలందరితో భగవద్గీత శ్లోకాలను చదివించాను. రెండు కథలను ( శరణాగతి) చెప్పాను. బుక్  మార్క్ చేయడం చూపించాను. సాయి రూపా,  భద్రాదేవి ,గాయత్రి ,లీల ధర్, హేమంత్ ,ప్రణవ ,సాయి, నాగ , స్నిగ్ధ క్లాస్ కి  హాజరయ్యారు. గుప్తా శరణ్య క్లాస్ కి రాలేదు.

25-4-2021  ఓం శ్రీ సాయిరాం , భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ,కోటి సమితి వారు నిర్వహిస్తున్న వికాస వాణి అనే కార్యక్రమం లో లో భాగంగా చిన్న పిల్లలందరికీ తెలుగు భాషలో చిన్న కథల ద్వారా తెలుగు చదవగల గడానికి మరియు తెలుగు భాషలో ప్రావీణ్యం పొందడానికి సహాయపడే ఈ కార్యక్రమంలో  మమ్మల్ని పాఠకులుగా చేర్పించిన స్వామివారికి శతకోటి వందనములు తెలియజేస్తూ, నేను ఒక చిన్న కథను చెప్పబోతున్నాను.

 19-6-2021  సాయిరాం, ఈరోజు (19-6-2021) బాలవికాస్ క్లాసులో శ్రీ సత్య సాయి బాబా వారి సుప్రభాతం వివరించడం పూర్తయింది. ఇంకా quiz కోసం పిల్లల్ని ప్రిపేర్ చేయించాను  ఒక చిన్న కథ చెప్పాను. కల్పన గారు ప్రభాకర్ గారు చెప్పిన భజనలను  revis చేయించారు. ఈరోజు క్లాస్ కి,(  హేమంగ్ ,గాయత్రి ,లీలాధర్, భద్రాదేవి, శరణ్య, నాగ ,సాయి, ప్రణవ్ ) జాయిన్ అయ్యారు. 

25/6/2021 సాయిరాం, ఈరోజు బాలవికాస్ క్లాస్ లో నేటి విద్యార్థులారా మరియు పరమాత్మ ప్రేమకు అనే రెండు పద్య సూక్తులు వివరించాను. మరియు గ్రూప్ టూ మోడల్ పేపర్  లోని ప్రతీ ప్రశ్నను  విపులంగా వివరించాను.  కల్పన సత్య స్వరూపిణి మా అనే భజనను మళ్లీ ఒకసారి  పిల్లలకు తెలియజేసింది. ఈరోజు బాలవికాస్  క్లాస్కకి ప్రణవ్ ,భద్రాదేవి , హేమంగ్, గాయత్రి ,సాయి రూప, సాయి గుప్త, శరణ్య ,నాగ ,సాయి, హాజరైనారు.


Monday, February 15, 2021

Bal Vikas Class and Coding Classes for Balvikas Children. 13-2-2021 and 14-2-2021

 ఈరోజు (13-2-21) బాలవికాస్ క్లాస్లో స్వామివారి  అష్టోత్తర నామాలు (40-50) వివరించి చెప్పాను. ఎట్టి కర్మ యు.... అనే పధ్యము చెప్పి వివరించాను. మరియు సంపూర్ణ శరణాగతి అనే కథను తెలిపాను. రోజు పిల్లలందరూ గాయత్రి మంత్రాన్ని చదువుతున్నారా లేదా తెలుసుకున్నాను. 

" జయహో జయహో గోపాల్ "  అనే భజనను కల్పన గారు నేర్పించారు.

ఈరోజు (14-2-21) మొదలుపెట్టిన  కోడింగ్ క్లాస్ కోచింగ్ లో మన బాల వికాస్ పిల్లలు (హేమంత్, గాయత్రి, లీల ధర్ ,ప్రణవ్, సాయి, నాగ) పాల్గొన్నారు.



13-2-2021 న చెప్పినారు. 


కర్మ చేయగ నరునకు కలదు హక్కు 

అడుగు ఫలమును నరునకు హక్కు లేదు 

కర్మ ఫలిమిచ్చు దాతకే కలదు హక్కు 

ఇంత కన్నను వేరెడ్డి ఎరుక పరతు. 


పనిచేసే విషయంలోనే మనిషికి హక్కు వున్నది. కానీ ఫలితాన్ని, అడిగే హక్కు మాత్రం అతనికి లేదు. కర్మ ఫలాన్ని, ఇచ్చే అయిన భగవంతునికే ఆ విషయంలో అధికారముంది. కనుక ప్రతి ఫలాన్ని, కోరకుండా, కర్తవ్య కర్మలను, చేయండి. ఇదియే కర్మ రహస్యము. ఇంతకంటే చెప్పవలిసినదేమున్నది? ( మన కర్మలు మానాలనే బంధించకుండా నేర్పును అలవర్చుకుని మన కర్మ యెగులము   కావలెనని స్వామి మనకు ప్రభోదించుచున్నారు. 


27-2-2021

సాయిరాం, ఈరోజు 27-2-2021 న  బాలవికాస్ క్లాస్ కి భద్రాదేవి ,గుప్తా శరణ్య, లీల ధర్, గాయత్రి, సాయి, నాగ పాల్గొన్నారు.

ఈరోజు క్లాసులో నమ్మకమను రెండు  నయనంబులే లేని- అనే పద్యము, శివరాత్రి పండుగ గురించి, మరియు 2 కథలు- (దృష్టి- దృశ్యము) తెలియచేసి, పేపర్ తో పర్సు, స్మాల్ హాట్ తయారు చేయ డం చూపించాను.

పిల్లలతో నాలుగు భగవద్గీత శ్లోకాలు మరియు 1- 30 అష్టోత్తర నామాలు చెప్పించాను.


Thursday, November 12, 2020

THURSDAY BALVIKAS BHAJAN... 12-11-2020: - INCHARGE SMT SRI SATHYA SAI BHUVANESWARI GARU.


 ఓం శ్రీ సాయిరాం శ్రీ భగవాన్ సత్య సాయినాధుని దివ్య ఆశీస్సులతో శ్రీ భగవాన్ సత్య సాయి సేవా సంస్థలు కోటి వారు ప్రతి గురువారం బాల్ వికాస్ విద్యార్థుల చేత రాత్రి ఇ 7 గంటల నుండి 7:30 వరకు ఆన్ లైన్ ద్వారా బాల్ వికాస్ భజన కార్యక్రమం జరుప బడుచున్నది

ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు,  శ్రీ విశ్వేశ్వర శాస్త్రి , శ్రీమతి విజయ లక్ష్మి,  కూడా పాల్గొన్నారు. 

విద్యార్థులు, చి|| హేమాంగ్,  గాయత్రీ, ప్రణవ్, భద్ర దేవి, సాయి రూప, సాయి , నాగ, లీలాధర్, పాల్గొన్నారు. 

చి|| సాయి గుప్తా, చి|| శరణ్య  పాల్గొన లేదు. 

భక్తి ప్రేమలతో  వేదపారాయణం భజనలు కోసాగినవి. 

చిరంజీవిహేమాంగ్ 3 ఓంకారము లు గణపతి అధర్వశీర్షం తో ప్రారంభించబడి వేదపారాయణం అనంతరం శాంతి మంత్రం చెప్పబడి గణపతి గురు మాతా భజనలతో కొనసాగింపబడీ మిగతా భజనలు బాల్ వికాస్ పిల్లలు ఆలపించారు 

మరచిపోయినది  మూడు సార్లు ఓంకారం తదనంతరం 30 సెకండ్లు మౌనం అసతోమా సద్గమయ చెప్పడము. ( స్వామిని క్షమించ వలసినది గా కోరినాను )

చి|| భద్ర దేవి స్వామి సందేశమును చదివినారు. 

చి|| లీలాధర్  స్వామివారికీ,  మంగళహారతి ఏంతో  భక్తి శ్రద్ధ ప్రేమలతో ముఖ్యముగా వైట్ డ్రెస్ లో, హారతి ఇచ్చి, హారతి ప్లేట్ ను హారతి తరువాత, మనను చూచునట్లుగా పెట్టినాడు. 

విభూతి  మంత్రంతో స్వామి ప్రసాదం తీసుకొన్న తరువాత భజన ముగిసినది. చిరంజీవి  స్వామికి కృతజ్ఞత తెలిపినాడు. 

బాలవికాస విధ్యార్ధులల్తో ఉత్సాహమును, ప్రోత్సహమును ఇచ్చే రీతిలో, స్వామి మెచ్చే విధముగా జరగాలని, మా కన్వీనర్ గారు   శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారిని కోరడము వారు పిల్లల భజనలలో సవరణలు, సూచనలు, ఇచ్చారు ధన్యవాదములు.  

ఈ కార్యక్రమంతా అమెజాన్ చైమై లో జరిగినది. 

ఈ కార్యక్రమాన్ని, ప్రతి గురువారం - శ్రీమతి సత్యసాయి భువనేశ్వరి గారు నిర్వహిస్తారు. ఈ వారం, 12-11-2020 నాడు కూడా నిర్వహించారు. 

వారు  భజన మరింత శ్రావ్యంగా, జరుగుటకు ఈ క్రింది విధంగా సూచనలు ఇచ్చినారు. 

" ఓం శ్రీ సాయిరాం ప్రతి గురువారం జరిగే బాల్ వికాస్ భజనలకు బాల్ వికాస్ విద్యార్థులు ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే గనక లేక ఒకే సెల్లో ఇద్దరు వస్తుంటే గనుక పేర్లు మధ్యలో ప్లస్ పెట్టగలరు ఈ ప్రతి గురువారం జరిగే బాలవికాస్ భజనలకు బాలవికాస్ గురువులు కూడా హాజరయ్యి బాల్ వికాస్ విద్యార్థులు పాడే భజనలను విని ఆనందించడం తో పాటు వాటి తప్పులను ఒప్పులను ప్రేమతో వివరించి, సవరించి, తెలిపే విధముగా  బాల్ వికాస్ గురువులు కూడా ఆన్లైన్లో బాలవికాస్ భజనలకు ప్రతి గురువారం హాజరుకావాలని శ్రీ సత్య సాయి కోటి సేవా సంస్థల సంస్థల కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు సూచనలను, ఏ మాత్రమూ ఆలస్యము లేకుండా వాట్సాప్ మెసేజ్ సంబంధితులకు పంపించారు." 

సాయిరాం 



Thursday, October 1, 2020

BALVIKAS BHAJAN 1-10-2020 : THURSDAY.

 

1-10-2020  BHAJAN





3 TIMES OMKAARAM 7.00PM TO 7.01PM BY SAI NAGA

 GANAPATHI ATHARWA SHEERSHAM 7.01PM TO 7.06PM BY GAYATRI NAGA

 RUDRAM 7.06PM TO 7.10PM BY BHADRADEVI

 SHANTHI MANTRAM 7.10PM TO 7.11PM BY SHARANYA

 3 TIMES OMKAARAM AND GANESH BHAJAN 7.11PM TO 7.13PM BY SAI GUPTA

 GURU BHAJAN BY BHADRADEVI

 MAATA BHAJAN BY SHARANYA

 SARVADHARMA BHAJAN BY HEMANG

 REMAINING BHAJANS BY ALL BALVIKAS CHILDREN

 3 TIMES OMKAARAM, 30SECONDS SILENCE AND ASATOMA SADGAMAYA  7.24PM TO 7.26PM BY LEELADHAR

 SWAMY MAATA 7.26PM TO 7.28PM BY PRANAV

 HAARATHI 7.28PM TO 7.30PM

THANKS GIVING TO SWAMY SAI ROOPA