ఓం శ్రీ సాయిరాం శ్రీ భగవాన్ సత్య సాయినాధుని దివ్య ఆశీస్సులతో శ్రీ భగవాన్ సత్య సాయి సేవా సంస్థలు కోటి వారు ప్రతి గురువారం బాల్ వికాస్ విద్యార్థుల చేత రాత్రి ఇ 7 గంటల నుండి 7:30 వరకు ఆన్ లైన్ ద్వారా బాల్ వికాస్ భజన కార్యక్రమం జరుప బడుచున్నది
ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ ప్రసాద్ గారు, శ్రీ విశ్వేశ్వర శాస్త్రి , శ్రీమతి విజయ లక్ష్మి, కూడా పాల్గొన్నారు.
విద్యార్థులు, చి|| హేమాంగ్, గాయత్రీ, ప్రణవ్, భద్ర దేవి, సాయి రూప, సాయి , నాగ, లీలాధర్, పాల్గొన్నారు.
చి|| సాయి గుప్తా, చి|| శరణ్య పాల్గొన లేదు.
భక్తి ప్రేమలతో వేదపారాయణం భజనలు కోసాగినవి.
చిరంజీవిహేమాంగ్ 3 ఓంకారము లు గణపతి అధర్వశీర్షం తో ప్రారంభించబడి వేదపారాయణం అనంతరం శాంతి మంత్రం చెప్పబడి గణపతి గురు మాతా భజనలతో కొనసాగింపబడీ మిగతా భజనలు బాల్ వికాస్ పిల్లలు ఆలపించారు
మరచిపోయినది మూడు సార్లు ఓంకారం తదనంతరం 30 సెకండ్లు మౌనం అసతోమా సద్గమయ చెప్పడము. ( స్వామిని క్షమించ వలసినది గా కోరినాను )
చి|| భద్ర దేవి స్వామి సందేశమును చదివినారు.
చి|| లీలాధర్ స్వామివారికీ, మంగళహారతి ఏంతో భక్తి శ్రద్ధ ప్రేమలతో ముఖ్యముగా వైట్ డ్రెస్ లో, హారతి ఇచ్చి, హారతి ప్లేట్ ను హారతి తరువాత, మనను చూచునట్లుగా పెట్టినాడు.
విభూతి మంత్రంతో స్వామి ప్రసాదం తీసుకొన్న తరువాత భజన ముగిసినది. చిరంజీవి స్వామికి కృతజ్ఞత తెలిపినాడు.
బాలవికాస విధ్యార్ధులల్తో ఉత్సాహమును, ప్రోత్సహమును ఇచ్చే రీతిలో, స్వామి మెచ్చే విధముగా జరగాలని, మా కన్వీనర్ గారు శ్రీమతి సరస్వతి ప్రసాద్ గారిని కోరడము వారు పిల్లల భజనలలో సవరణలు, సూచనలు, ఇచ్చారు ధన్యవాదములు.
ఈ కార్యక్రమంతా అమెజాన్ చైమై లో జరిగినది.
ఈ కార్యక్రమాన్ని, ప్రతి గురువారం - శ్రీమతి సత్యసాయి భువనేశ్వరి గారు నిర్వహిస్తారు. ఈ వారం, 12-11-2020 నాడు కూడా నిర్వహించారు.
వారు భజన మరింత శ్రావ్యంగా, జరుగుటకు ఈ క్రింది విధంగా సూచనలు ఇచ్చినారు.
" ఓం శ్రీ సాయిరాం ప్రతి గురువారం జరిగే బాల్ వికాస్ భజనలకు బాల్ వికాస్ విద్యార్థులు ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే గనక లేక ఒకే సెల్లో ఇద్దరు వస్తుంటే గనుక పేర్లు మధ్యలో ప్లస్ పెట్టగలరు ఈ ప్రతి గురువారం జరిగే బాలవికాస్ భజనలకు బాలవికాస్ గురువులు కూడా హాజరయ్యి బాల్ వికాస్ విద్యార్థులు పాడే భజనలను విని ఆనందించడం తో పాటు వాటి తప్పులను ఒప్పులను ప్రేమతో వివరించి, సవరించి, తెలిపే విధముగా బాల్ వికాస్ గురువులు కూడా ఆన్లైన్లో బాలవికాస్ భజనలకు ప్రతి గురువారం హాజరుకావాలని శ్రీ సత్య సాయి కోటి సేవా సంస్థల సంస్థల కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు సూచనలను, ఏ మాత్రమూ ఆలస్యము లేకుండా వాట్సాప్ మెసేజ్ సంబంధితులకు పంపించారు."
సాయిరాం
No comments:
Post a Comment