Sunday, August 4, 2024

GROUP I EXAMINATION 4-8-2024: @ ROYAL PLAZA APARTMENTS SULTAN BAZAR BALVIKAS CENTRE.












ఓం శ్రీ సాయిరాం భగవాన్ శ్రీ శ్రీ సత్య సాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు సత్యసాయి సేవా సంస్థలు కోటి సమితి లో, శ్రీ సత్య సాయి బాలవికాస్ కోటి సుల్తాన్ బజార్, బాలబాలికలకు, గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడం అయినది. సమయం మూడు గంటల నుంచి 5 గంటల వరకు. ఈ గ్రూప్ 1  ఓరల్  పరీక్ష. పరీక్షలో, 11 మంది విద్యార్థులు, పాల్గొని, ఎంతో ఉత్సాహంగా, గురువుల అడిగిన ప్రశ్నలకు, సమాధానాలు ఇచ్చి, ఈ శ్లోకం అయినా ఎంతో చక్కగా, చెప్పి ఉన్నారు. పిల్లలను గురువుగారైన విశ్వేశ్వర శాస్త్రి ప్రశ్నలు వేయటం వీడియో ద్వారా, ఆ జవాబులను, శ్రీమతి రేణుక గారు బాలవికాస్ గురువులు, న్యాయ నిర్ణయితలుగా, ఉండి వారికి మార్కులు వేసినారు. పాల్గొన్న విద్యార్థులు: బలేశ్వర్ సాయి  ప్రసాద్,నవలేసాత్విక, సుప్రియ, కార్తిక్, నిహారిక, అనన్య, సంహిత, జాహ్నవి, అవంతిక, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ నవలే, మరియు సంధ్యారాణి, పాల్గొన్నారు.

కన్వీనర్ మరియు బాల వికాస్ గురువు విశ్వేశ్వర శాస్త్రి పిల్లల తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ, పిల్లలను ప్రతి ఆదివారం నాడు మూడు గంటల నుండి నాలుగు గంటల వరకు, క్రమం తప్పకుండా పంపి, మనమంతా స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ  గ్రూప్ 1 పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు, 11 మందికిస్వామి 99వ పుట్టు పండుగ సందర్భంగా, నవంబర్ మాసంలో శివంలో జరిగే  జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా పెద్ద కార్యక్రమంలో, ఈ సర్టిఫికెట్స్ వితరణ కార్యక్రమాన్ని  నిర్వహించనున్నట్లుగా వివరించారు

Successful Conduct of Group 1 Oral Examination at Sathya Sai Bal Vikas

A detailed report of the event:

Today, under the Divine grace of Bhagawan Sri Sathya Sai Baba, a Group 1 oral examination was conducted for children at the Sathya Sai Seva Samithi, Koti Sultan Bazaar, Sathya Sai Bal Vikas. The examination took place from 3:00 PM to 5:00 PM. Eleven students enthusiastically participated and answered the questions posed by their teacher with great confidence, even reciting slokas flawlessly.

Mr. Visveshwara Sastry, the teacher, conducted the examination via video, while Ms. Renuka, a Bal Vikas teacher, acted as the judge, evaluating the students' responses remotely. The participating students were: Baleshwar Sai Prasad Navale, Sathvika, Supriya, Karthik, Niharika, Ananya, Samhitha, Jahnavi, Avantika, Akhileshwar Sai Prasad Navale, and Sandhyarani.

Addressing the parents, Mr. Visveshwara Sastry, the convener and BalVikas teacher emphasized the importance of sending their children regularly every Sunday from 3:00 PM to 4:00 PM to seek Swami's blessings. He also announced that the students who passed the Group 1 examination (all 11 of them) will be awarded certificates at a grand event to be held in November at Shivam as part of Swami's 99th birth anniversary celebrations.



Thursday, April 11, 2024

3 DAYS SRI SATHYA SUMMER CAMP & MATRU POOJA CELEBRATIONS ON 25 TO 27 TH APRIL 2024 9 AM TO 11 AM

 

3 DAYS SRI SATHYA SUMMER CAMP & MATRU POOJA CELEBRATIONS ON 25 TO 27 TH APRIL 2024 9 AM TO 11 AM 





భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ఈ రోజు అనగా 25-4-2024 న శ్రీ సత్య సాయి ఉచిత 3  రోజుల వేసవి  శిక్షణా శిభిరాన్ని, గవర్నమెంట్ కుంటా రోడ్ హై స్కూల్ బాల, బాలికల  పాఠశాలలో అత్యంత భక్తి శ్రద్దలతో, జ్యోతి ప్రకాశనం గావించి, అనంతరం శ్రీమతి రేణుక బాలవికాస్ గురువులు పద్యసూక్తిలో భాగంగా,, “మనసులో నున్న భావంబు  మంచి దయిన, కలిగి తీరును ఫలసిద్ధి  కార్యమందు, మనసులో నున్న భావంబు మలినమైన ఫలము గూడను ఆ రీతి మలిన మవును. అనే పద్యాన్ని, వినిపించి, దానిలోని అర్ధాన్ని, విద్యార్థులకు అర్ధమయ్యే వివరించారు. 

రెండవ రోజు చీమ స్వార్ధంబు అనే పద్యాన్ని, 3 వ రోజు ఇనుము విరిగినంత ఇమ్మరు ముమ్మారు అనే పద్యాన్ని, అర్ధాన్ని, దానికి సంభందించిన చిన్ని కథను భోదించారు. 


శ్రీమతి కల్పనగారు విద్యార్థులను 3 రోజులు 3 భజనలు నేర్పారు.  లవ్ ఐస్ మై FORM, మొదలగునవి నేర్పినారు.


ఈ 3 రోజులు, శ్రీమతి శైలేశ్వరి గారు,  పిల్లలకి, యోగాసనాలు ,ధ్యానం, సూర్య నమస్కారాలు ,వర్లి ఆర్ట్ లో కొంత భాగం, తెలపడం జరిగింది మరియు పిల్లలచే ఆక్టివిటీ చేయించడం జరిగింది. 

 

27-4-2024 తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమములో భాగంగా, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, ఈశ్వరమ్మ గారి జీవితమ్ లోని కొన్ని ముఖ్య ఘట్టాలను చిప్పిన తరువాత, పూజ కార్యక్రమం ప్రారంభమైనది. 


ఈ మూడు రోజుల ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో, ఉత్సాహంగా ఉల్లాసంగా పద్యాలు పాటలు ఓన్లీ ఆర్ట్స్, కార్యక్రమంలో నేర్చుకున్న వారికి, ఒకటి రెండు మూడు బహుమతులను కూడా కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారి చేతుల మీదుగా పిల్లలకు ఇవ్వడం జరిగింది. కన్వీనర్, తల్లిదండ్రుల తో మాట్లాడుతూ, ఈ పిల్లలు ఈ మూడు రోజులకే పరిమితం కాకుండా, కోటి సమితి బాలవికాస్ తరగతులను కూడా నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమం ఉస్మాన్ గంజ్లో  తోపు ఖానా లో గల, శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో, ప్రతి శనివారం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు బాల వికాస్ తరగతులు నిర్వహిస్తున్నట్లు, దానికి, 24 మందిలో, ఉత్సాహవంతులైన వారు జాయిన్ కావచ్చు అని సూచించగా, అప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు వారి పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి  వచ్చే శనివారం నుండి బాలవికాసు తరగతులు ప్రారంభం కానున్నాయి. 



మంగళ హారతి తో  మూడు రోజుల ఉచిత వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది

 

ఈ కార్యక్రమంలో, కల్పన శైలేశ్వరి, శ్రీమతి రేణుక, శ్రీమతి వాణి, మాస్టర్ లీలాధర్, మాస్టర్ హేమాంగ్, మాస్టర్ ప్రణవేందర్, సమితి కన్వీనర్ పీ విశ్వేశ్వర శాస్త్రి, డెవలప్మెంట్ ట్రైనీస్, మీనాక్షి, కవిత తదితరులు పాల్గొన్నారు.


No. of parents- 11 No. of children- 30
Samithi Convenor. No. of gurus- 3 No. of Pre sevadal- 3 No. of sevadal- 2

Friday, March 22, 2024

22-3-2023 - MAHILA POOJA, SEVA, BHAJANA. AT SIVAM.

 

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు శివం మందిరం లో పూజ, సాయంత్రం సేవ, భజన, మరియు స్పెషల్ హారతి, కన్నులపండుగా జరిపించిన స్వామికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటూ, 

సాయంత్రం, శ్రీమతి చండీబీ, 3 గంటలకే వచ్చి, శివమ్ మందిరం ప్రాంగణం అంతా, 2 గంటల పాటు, పరిశుబ్రము  గావించి, స్వామి నడిచిన ప్రతి అంగుళము లో వున్న ధూళి, దుమ్ము ను శుబ్రము గావించి, స్వామి ప్రేమకు పాత్రురాలైనది అనుటలో ఏ మాత్రము అతిశయోక్తి లేదు. 5 గంటలకు శ్రీమతి రేణుక గారు కూడా విచ్చేసి శుబ్రము గావించారు. 

భజన జరుగు తున్నప్పుడు శ్రీ హరిహరన్ గారు వచ్చి, శ్రీమతి చండీబీ, 3 గంటలకు వచ్చినదని నాకు చెవులో చెప్పాడు. 

భజనకు, సురేద్ర పటేల్ గారితో పాటు, బాలవికాస్ విద్యార్థులు కూడా  నాతొ వచ్చినారు. 

జిల్లా అధ్యక్షులు శ్రీ మల్లేశ్వర గారు, బాలవికాస్ విద్యార్థులను చూసి, సంతోషించి, వారు పాడిన భజనలను, తెలుసుకొని, మళ్ళి  పాడించుకొని ఆశీర్వదించారు. 















Monday, March 11, 2024

BALVIKAS CLASS ON 10-3-2024 -

 BALVIKAS CLASS ON 10-3-2024 

శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల  సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో  ఈ రోజు బాల వికాస్ కార్యక్రమములో భాగంగా, ప్రార్ధన గురించి వివరించి, భజనలు, శ్రీ సత్య సాయి సుప్రభాతం, (4) పంక్తులు, హనుమాన్ చాలీసా, రివిజన్ చేయించి, బాలవికాస్ విద్యార్థి, బాలేష్ పుట్టిన రోజు సందర్భముగా,  బర్త్డే విషెస్ తో పాటు, కేక్ కట్ చేయించి అందరికి పంచడమైనది. హ్యాపీ బర్త్ డే తో బాలేష్.