3 DAYS SRI SATHYA SUMMER CAMP & MATRU POOJA CELEBRATIONS ON 25 TO 27 TH APRIL 2024 9 AM TO 11 AM
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, హైదరాబాద్ ఈ రోజు అనగా 25-4-2024 న శ్రీ సత్య సాయి ఉచిత 3 రోజుల వేసవి శిక్షణా శిభిరాన్ని, గవర్నమెంట్ కుంటా రోడ్ హై స్కూల్ బాల, బాలికల పాఠశాలలో అత్యంత భక్తి శ్రద్దలతో, జ్యోతి ప్రకాశనం గావించి, అనంతరం శ్రీమతి రేణుక బాలవికాస్ గురువులు పద్యసూక్తిలో భాగంగా,, “మనసులో నున్న భావంబు మంచి దయిన, కలిగి తీరును ఫలసిద్ధి కార్యమందు, మనసులో నున్న భావంబు మలినమైన ఫలము గూడను ఆ రీతి మలిన మవును. అనే పద్యాన్ని, వినిపించి, దానిలోని అర్ధాన్ని, విద్యార్థులకు అర్ధమయ్యే వివరించారు.
రెండవ రోజు చీమ స్వార్ధంబు అనే పద్యాన్ని, 3 వ రోజు ఇనుము విరిగినంత ఇమ్మరు ముమ్మారు అనే పద్యాన్ని, అర్ధాన్ని, దానికి సంభందించిన చిన్ని కథను భోదించారు.
శ్రీమతి కల్పనగారు విద్యార్థులను 3 రోజులు 3 భజనలు నేర్పారు. లవ్ ఐస్ మై FORM, మొదలగునవి నేర్పినారు.
ఈ 3 రోజులు, శ్రీమతి శైలేశ్వరి గారు, పిల్లలకి, యోగాసనాలు ,ధ్యానం, సూర్య నమస్కారాలు ,వర్లి ఆర్ట్ లో కొంత భాగం, తెలపడం జరిగింది మరియు పిల్లలచే ఆక్టివిటీ చేయించడం జరిగింది.
27-4-2024 తల్లిదండ్రులకు పాద పూజ కార్యక్రమములో భాగంగా, కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి, ఈశ్వరమ్మ గారి జీవితమ్ లోని కొన్ని ముఖ్య ఘట్టాలను చిప్పిన తరువాత, పూజ కార్యక్రమం ప్రారంభమైనది.
ఈ మూడు రోజుల ఉచిత వేసవి శిక్షణ శిబిరంలో, ఉత్సాహంగా ఉల్లాసంగా పద్యాలు పాటలు ఓన్లీ ఆర్ట్స్, కార్యక్రమంలో నేర్చుకున్న వారికి, ఒకటి రెండు మూడు బహుమతులను కూడా కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి గారి చేతుల మీదుగా పిల్లలకు ఇవ్వడం జరిగింది. కన్వీనర్, తల్లిదండ్రుల తో మాట్లాడుతూ, ఈ పిల్లలు ఈ మూడు రోజులకే పరిమితం కాకుండా, కోటి సమితి బాలవికాస్ తరగతులను కూడా నిర్వహిస్తున్నట్లు, ఈ కార్యక్రమం ఉస్మాన్ గంజ్లో తోపు ఖానా లో గల, శ్రీ సత్య సాయి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో, ప్రతి శనివారం ఐదు గంటల నుంచి 6 గంటల వరకు బాల వికాస్ తరగతులు నిర్వహిస్తున్నట్లు, దానికి, 24 మందిలో, ఉత్సాహవంతులైన వారు జాయిన్ కావచ్చు అని సూచించగా, అప్పటికప్పుడు కొంతమంది విద్యార్థులు వారి పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. కాబట్టి వచ్చే శనివారం నుండి బాలవికాసు తరగతులు ప్రారంభం కానున్నాయి.
మంగళ హారతి తో మూడు రోజుల ఉచిత వేసవి శిక్షణ శిబిరం కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది
ఈ కార్యక్రమంలో, కల్పన శైలేశ్వరి, శ్రీమతి రేణుక, శ్రీమతి వాణి, మాస్టర్ లీలాధర్, మాస్టర్ హేమాంగ్, మాస్టర్ ప్రణవేందర్, సమితి కన్వీనర్ పీ విశ్వేశ్వర శాస్త్రి, డెవలప్మెంట్ ట్రైనీస్, మీనాక్షి, కవిత తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment