Sunday, December 31, 2023

SERVICE DAY 31-12-2023

స్వామివారి అనుగ్రహంతో ఈరోజు కోటి సమితి  బాలవికాస్ విద్యార్థులు  స్వామివారి విభూతి ప్యాకెట్స్ ప్యాక్ చేయడం నేర్చుకొని చేసి, వాటిని శివం మందిరంలో పెట్టడం జరిగింది. అలాగే వారితో  పూలమాలను తయారు చేయించి, స్వామివారికి వారేస్వయంగాఅలంకరించారు.చివరగా,స్వామివారికి,హారతి సమర్పరణతో సర్వీస్ డే కార్యక్రమము సంపూర్ణమైనది.

భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య అనుగ్రహంతో ఈరోజు అనగా 31-12-2023 న శివం మందిరంలో కోటి సమితి పక్షాన గ్రూప్ -3 ప్రాజెక్ట్, స్వామివారి పాదాల చెంత సమర్పించడం జరిగింది. 

దీనిలో చిరంజీవి గాయత్రి, మాస్టర్ లీలాధర్ , 'లైఫ్ ఆఫ్  సెయింట్ ( life of Saints)'అనే టాపిక్ పైన 

మరియు మాస్టర్ సాయి కృష్ణ  '5- ఎలిమెంట్స్'  ( పంచ భూతములు ) అనే అంశం పై   ప్రాజెక్ట్ చేసి స్వామి వారికి సమర్పించారు.





 

Saturday, December 30, 2023

BALVIKAS CLASS 31-12-2023 - NEW YEAR CELEBRATIONS.




సాయిరాం - మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు ఆంగ్ల నూతన సంవత్సర  శుభాకాంక్షలు

𝖂𝖊 𝖜𝖎𝖘𝖍 𝖞𝖔𝖚 𝖆𝖓𝖉 𝖞𝖔𝖚𝖗 𝖋𝖆𝖒𝖎𝖑𝖞 𝖒𝖊𝖒𝖇𝖊𝖗𝖘 𝖆 𝕳𝖆𝖕𝖕𝖞 𝖆𝖓𝖉 𝖕𝖗𝖔𝖘𝖕𝖊𝖗𝖔𝖚𝖘 𝕹𝖊𝖜 𝖞𝖊𝖆𝖗 2024. 𝕸𝖆𝖞 𝖙𝖍𝖎𝖘 𝕹𝖊𝖜 𝖞𝖊𝖆𝖗 𝖇𝖗𝖎𝖓𝖌 𝖍𝖆𝖕𝖕𝖎𝖓𝖊𝖘𝖘, 𝖕𝖗𝖔𝖘𝖕𝖊𝖗𝖎𝖙𝖞, 𝖕𝖔𝖘𝖎𝖙𝖎𝖛𝖎𝖙𝖞 𝖆𝖓𝖉 𝖏𝖔𝖞 𝖎𝖓 𝖞𝖔𝖚𝖗 𝖑𝖎𝖋𝖊. 

P V SASTRY






కోటి సమితి బాలవికాస్ విద్యార్థుల - ఆంగ్ల నూతన సంవత్సర వేడుకలు 


ఈ నాటి బాలవికాస్ తరగతిలో, 31-12-2023 న, భజన, హనుమాన్ చాలీసా, విభూతి మహిమ, ప్రార్ధన   గూర్చి, సవివరంగా తెలిపిన అనంతరం, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి నూతన సంవత్సర సందేశమును, పిల్లలకు అర్ధమయ్యే రీతిలో ఈ విధముగా తెలియ జేయడమైనది. 

"ప్రతి క్షణము నూతన సంవత్సరమే - కొత్త సంవత్సరములు, కొత్త నెలలు మనకు  ఆనందాన్ని, దుఃఖాన్ని, కష్టాన్ని తీసుకొని రావటంలేదు. ప్రతి సెకండ్ కూడను ఒక నూతనమైనటువంటిదే. సెకండ్ లేక నిమిషము రాదు. నిమిషము లేక గంటలు రావు. గంటలు లేక దినములు గడువవు. దినములు లేక నెలలు గడువవు. నెలలు లేక సంవత్సరం రాదు. కాబట్టి  సంవత్సరం అంతయు కూడను క్షణములతోనే ఆధారపడి ఉంటున్నాదిప్రతి క్షణము కూడను మనము పవిత్రముగా అనుభవించినప్పుడే,  సంవత్సరము  నూతన సంవత్సరము అవుతుంది. ఒక్కొక్క క్షణము మనము ఎట్టి కార్యముల చేత, ఎట్టిగుణముల చేత, ఎట్టి ప్రవర్తన చేత కాలము గడుపుతున్నామో. దాని ఫలితమే మన  సంవత్సర ఫలితం." 

స్వామి సందేశానంతరం కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ స్వామి సందేశాన్ని వారి దినందిక జీవితంలో  అమలు పరిచే విధంగా శక్తిని ఇవ్వమని స్వామిని వేడుకొన్నారు . పిల్లల తల్లులు కూడా పాల్గొన్నారు. కన్వీనర్, బాలవికాస్  గురువు,  తల్లులతో మాట్లాడుతూ, పిల్లలకు సెల్ ఫోన్ ట్.వి.  ఎక్కవ చూడకుండా చేయాలనీ, ముఖ్యంగా అన్నము తినే వేళలో అస్సలు చూడకుండా ఉండాలని,  భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి  అందరు కలిసి స్వామి వారికీ మంగళ హారతి ఇవ్వగా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది . ఈ కార్యక్రమంలో,  బాలేశ్వర్, అఖిలేశ్వర్, నిహారిక,ఆశ్రిత్, సుప్రియ, కార్తీక్, ఆశ్రిత, సంహిత,అనన్య, సాత్విక, వారి మాతృ మూర్తులు, పాల్గొన్నారు.

HAARATHI 


CAKE CUTTING 



Sunday, December 17, 2023

Balvikas Class dt 17-12-2023

 

ఈ రోజు బాలవికాస్ క్లాస్ లో 11  మంది హాజరైనారు. ఈ రోజు భజనలు రివైజ్ చేయించి, భజన హాల్ లో ఏ రకముగా పాడాలో పర్ఫెక్ట్ గా సాధన గావించడమైనది.

తరువాత ప్రార్ధన గూర్చి వివరముగా చెప్పి ఆ 5 లైన్స్ మేటర్ పుస్తకములోనుండి ఫోటో తీసి వాట్సాప్ గ్రూప్ లో పోస్ట్ చేసినాను. ఆ మేటర్ అంతా నేర్చుకొని హోమ్ వర్క్ క్రింద  వ్రాయ మని చెప్పడమైనది.

22 వ తేదీ న భజన అంటే నాలుగవ శుక్రవారం న శివమ్ లో భజన పాడుటకు ప్రాక్టీస్ చేయమని, వారి తల్లులను కూడా శివంకు రావలసినది ఆహ్వానం పలికినాను.