Saturday, December 11, 2021

WALK FOR THE VALUES: 13-12-2021 WITH PRESS CLIPPINGS

 








"మానవతా విలువల పై విద్యార్థుల ప్రదర్శన"

ప్రజల్లో మానవతా విలువలను పెంపొందించే లక్ష్యంతో సత్యసాయి సేవా సంస్థలు,  కోటి సమితి ఆధ్వర్యంలో,  విలువలతో కూడిన నడక పేరిట, చేసిన ప్రదర్శనలో  పాల్గొన్న విద్యార్థులు, నీతి వాక్యాలు మానవతా విలువలతో  రూపొందించిన, ప్లై  కార్డులను చేత పట్టుకొని సాయి గాయత్రీ మంత్రం పఠిస్తూ  సుల్తాన్ బజార్,  ప్రధాన వీధుల్లో ప్రదర్శన గావించారు. 

దేవుడు ఒక్కడేనని,  సాటి మనిషిని ప్రేమిస్తూ సేవా తత్వాన్ని కలిగి ఉండడమే జీవిత పరమార్థమని శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోటి,  సభ్యులు  విలువలతో కూడిన  ర్యాలీని కోటి సమితి దత్తత తీసుకున్న సుల్తాన్ బజార్, బడే చౌది లో నయా బజార్ గవర్నమెంట్, హై స్కూల్ లో, అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్, జండా ఊపి విలువలతో కూడిన నడకను ను ప్రారంభించారు. 

తొలుతగా కోటి సమితి బాలవికాస్ విద్యార్థులు, వేదం, సాయి గాయత్రీ మంత్రములను జపిస్తూ, కార్యక్రమము కొనసాగినది. అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్,  కోటి సమితి చేస్తున్న అనేక కార్యక్రమాలను అభినందిస్తూ ప్రతి ఒక్కరూవిలువలతో కూడిన నడవడికను పెంపొందించుకోవాలని అన్నారు. 

స్వామి వారి ప్రేమ ను 2022 డైరీ రూపంలో స్వామి చిర కాల భక్తులు శ్రీ శరత్ చంద్ర గారు అసిస్టెంట్ కమిషనర్ అఫ్ పోలీస్ శ్రీ పి దేవేందర్ గారికి బహకరించారు. 

ఈ కార్యక్రమములో బాలవికాస గురువులు, విద్యార్థులు, మహిళలు,   కూడా పాల్గొన్నారు. 

అందరినీ ప్రేమించు అందరినీ సేవించు, మానవసేవే మాధవసేవ, ఒకే భాష అదే హృదయ భాష ప్రదర్శించారు.

ఈ ప్రదర్శన కార్యక్రమము కందస్వామి లో గల షిరిడి బాబా దేవాలయంలో శ్రీ శ్రీ శరత్ చంద్ర గారు విద్యార్థుల నుద్దేశించి వాల్యూస్ గూర్చి విపులంగా పిల్లల కు అర్ధమయ్యే రీతిలో, రామయంలో లోని కధలు, మహాత్ముల జీవితాల విశేషాలలో మనం నేర్చుకోవలసిన అనేక విలువలను పిల్లలకు హత్తుకొనే విధముగా, తెలిపారు. 

ఈ నాటి కార్యక్రములో, బాలవికాస్ విద్యార్థులు, వారి తల్లితండ్రులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 




Thursday, December 9, 2021

BALAVIKAS - STUDENTS OBSERVATIONS.


BALAVIKAS - STUDENTS KOTI SAMITHI 


1. చిరంజీవి  సాయి రూప-మర్యాదస్తురాలు, నిదానంగా చెప్పినది పాటిస్తుంది, పాడుతుంది,

2. చిరంజీవి  భద్రాదేవి-సమయపాలన, నమ్రత కలది, చెప్పినది, ఎప్పటికప్పుడు నేర్చుకుంటుంది. 

3. మాస్టర్  ప్రణ వేందర్ రెడ్డి - చురుకుగా ఉంటాడు, ధైర్యంగా మాట్లాడతాడు, క్రికెట్ లో  శిక్షణ తీసుకుంటున్నాడు.  అమ్మ గారు బాల్ వికాస్ గా కోటి సమితి  మొదటి గురువు వున్నారు. 

4. మాస్టర్  హేమాంగ్ నాగ - హైపర్ యాక్టివ్, నాయకత్వ లక్షణాలు కలవాడు, సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ వున్నాడు. 

5. చిరంజీవి జయ గాయత్రీ నాగ = నిదానంగా ఉంటుంది, నీట్ గా డ్రెస్ వేసుకుని ఉంటుంది, అమ్మ,నాన్న, గురువుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తుంది

6.మాస్టర్ సాయి గుప్తా  -   తెలుగులో కథలు బాగా చెప్పగలడు, క్రమశిక్షణగా ఉంటాడు

7. మాస్టర్ లీలా ధర్ - వేదం, భజన చక్కగా చెప్తాడు, కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నది

8. మాస్టర్  సాయి - వేదం చక్కగా పలుకుతాడు, శ్రద్ధగా నేర్చుకుంటాడు

9. మాస్టర్  నాగ - ఎంతో ప్రేమగా ఉంటూ మర్యాదగా , ప్రవర్తిస్తాడు, క్షమా ప్రార్థన ఎంతో బాగా చెప్తాడు.

10. చిరంజీవి   శరణ్య - భజన పాటలు ధైర్యంగా  పాడుతుంది. 


                                                              ---O0O---- 


SRINIKHA -  8143381200   BHARANI=8184832287   Vaishnavi=9550901612

C/O SMT BHUVANESWARI 



Saturday, December 4, 2021

BALVIKAS STUDENTS PERFORMING ABHISEKHAM ON 4-12-2021 THE LAST DAY OF KAARTEEKA MAASAM.

 

BALVIKAS STUDENTS PERFORMING ABHISEKHAM ON 4-12-2021 THE LAST DAY OF KAARTEEKA MAASAM. 









శ్రీ సత్యసాయి సేవా సంస్థలు కోఠీ  సమితి ఆధ్వర్యంలో, కార్తీక మాసం చివరి రోజు, శనివారం అమావాస్య, అనురాధ నక్షత్రంలో,  మధ్యాహ్నం 1- 15 నిమిషాల నుంచి, 2-00  గంటల వరకు, కోఠీ బాలవికాస్ విద్యార్థుల చేత, శ్రీ రుద్ర పారాయణం గావిస్తూ, అందరూ అభిషేకం చేసుకోవటం ఎంతో వైభవోపేతంగా ఈ కార్యక్రమం జి.పుల్లారెడ్డి బిల్డింగ్స్, 6వ అంతస్థులో గల శ్రీ సత్య సాయి సేవా సంస్థుల,  మందిర ప్రాంగణంలో అత్యంత భక్తి శ్రద్ధలతో పిల్లలంతా ఎంతో శ్రావ్యంగా, ఉచ్చారణ దోషములు లేకుండా, వారి తల్లితండ్రులతో కలసి వచ్చి పాల్గొని , స్వామి ఆశీస్సులతో జరిగి, అందరూ తీర్ధ  ప్రసాదములు తీసుకొని స్వామి అనుగ్రహనికి పాత్రులైనారు.  ఈ రోజు అంటే కార్తీక  అమవాస్య నాడు అభిషేకం చేస్తే, కార్తీక మాసమంతా చేసిన పుణ్యం దక్కుతుందని, ఈ రోజు ఈ కార్యక్రమాన్నీ చేయ తలపెట్టినాము. 


ఈ కార్యక్రమంలో భాగంగా, కన్వీనర్ శ్రీ విశ్వేశ్వర శాస్త్రి గారు, బాల్ వికాస్ గురువు గారు, శ్రీమతి శైలి శ్వరి   గారు, బాల్ వికాస్ కోఆర్డినేటర్ శ్రీమతి మహాలక్ష్మి గారు, శ్రీమతి విజయలక్ష్మి గారు, శ్రీ రాము గారు, శ్రీ శ్రీనివాస్ గారు, శ్రీ మతి భువనేశ్వరి గారు, శ్రీ స్వామి యొక్క ఆశీస్సులతో  పాల్గొన్నారు.