Thursday, May 16, 2019

Sri Sathya Sai Seva Organisations, Koti Samithi. Hyd. 2019 Summer Camp..

Video Link. 





Report dated 18-5-2019

శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో 10 రోజుల ఉచిత వేసవి శిక్షణశిభిరాన్ని అబిడ్స్ లో గల జి.పుల్లరెడ్డి భవనం, సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాంగణం లో మే 9  ప్రముఖ జర్నలిస్ట్,ఇంద్రజాలకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ చొక్కాపు వెంకట రమణ గారు ముఖ్యఅతిథిగా విచ్చేసి, జ్యోతి ప్రకాశనము కావించిన   విషయము తెలిసినదే.

రోజు 18-5-2019  ముగింపు కార్యక్రమమునకు, శ్రీ సత్యసాయి సేవా సంస్థల, తెలంగాణ  రాష్ట్ర బాలవికాస్  కో-ఆర్డినేటర్,  శ్రీమతి పి. గంగ విచ్చేసారు.   పది రోజులలో, సమ్మర్క్యాంపు  లో  విద్యార్థులు నేర్చుకున్న, విషయాలన్నింటిని, ముఖ్యఅతిధి గారి సమక్షములో, వేదము, భజనలు, సత్యసాయి ఇంగ్లీష్ పాటలను, శ్రావ్యముగా, ఏంతొ క్రమశిక్షణతో,  పాటలు పాడి, నేర్చుకున్నవిలువలను, ఆచరణలో, పెట్టునట్లుగా, విద్యార్థులు చెప్పగా, ఎంతో సంతోషించారు.

సమ్మర్క్యాంపులో పాల్గొన్న బాలబాలికలకు, అందరికి జ్ఞ్యాపికలను  బహూకరించి, కోటిసమితి బాలవికాస్ గురువులను, అందరిని, అభినందించారు.

ఈనాటి కార్యక్రమములో బాలవికాస గురువు శ్రీమతి రేణుక, మహిళా ఇంచార్జి శ్రీమతి విజయలక్ష్మి, సమితి కన్వీనర్, పి విశ్వేశ్వర శాస్త్రి, సేవాదల్ సభ్యులు రవీందర్రెడ్డి, సునీత, పద్మావతి, సబితా బాల బాలికలతల్లి తండ్రులు పాల్గొన్నారు.
గంగ గారు  భగవానునికి మంగళహారతి సమర్పణతో కార్యక్రమము దిగ్విజయముగా ముగిసినది.

కన్వీనర్, పి విశ్వేశ్వరశాస్త్రి మాట్లాడుతూ, రేపటి నుండి యధావిధిగా , ప్రతి ఆదివారము బాలవికాస్ తరగతులు, ఉదయం8-30 నుండి 11 గంటలవరకు జరుగునని తెలిపారు.


సమితి కన్వీనర్
పి .విశ్వేశ్వర శాస్త్రి.


No comments:

Post a Comment