Report on Distribution
of plants DATED 15-10-2017
Please Click the Link to see the Photos Distributing Plants by Balvikas Children of Koti Samithi.
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, వారి ఆధ్వర్యంలో, శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు,ఈ రోజు ఉదయం అంటే 15-10-2017న ఒక వినూత్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, అబిడ్స్, జంక్షన్ లో జవహర్ లాల్ నెహ్రు విగ్రహం దగ్గర, ట్రాఫిక్ స్టాప్ సిగ్నల్, పడగానే వాహన చోదకులలో ఒక అవగాహన కల్పించి, వారికి, అలవెరా మొక్కలను, మధుమేఘము తగ్గించే నీలవేణి, మొక్కలను, తులసి మొక్కలను, నేరేడు చెట్టు మొక్కలను, ఇచ్చి, మొక్కలను జాగ్రత్తగా వారి వారి గృహములలో మొక్కలునాటుకొని
, వాటి వల్ల ప్రయోజనము పొందవలసినదిగా కోరుతూ, వారికీ దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ మొక్కలను అందజేశారు. బాలవికాస ఇంచార్జి, శ్రీ సీత మహాలక్ష్మి, సిఐ శ్రీకాంత్ గారికి కూడా మధుమేఘము తగ్గించే ఔషధ కక్షణాలున్న నీలవేణి మొక్కను వితరణ గావించారు. ఈ పవిత్ర కార్యక్రమము లో అబిడ్స్, ట్రాఫిక్ సిఐ శ్రీకాంత్ గారు, పలువురు ట్రాఫిక్ కాన్స్టేబుల్పై,
పాల్గొని ప్రోత్సహామును ఇచ్చి, శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమము లో మరియు, చల్లా రామ ఫణి, బాలవికాస్ గురూస్ ఇంచార్జి, శ్రీ సీత మహాలక్ష్మి, బాలవికాస గురు రేణుక, 10 మంది బాలవికాస విద్యార్థులు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంతా, సమితి కన్వీనర్, విశ్శ్వేశ్వర శాస్త్రి పర్వేవేక్షణలో జరిగినది.
సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి
No comments:
Post a Comment