ఓం శ్రీ సాయి రామ్
అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు 20-10-2017
భగవాన్ శ్రీ సత్య సాయిబాబా దివ్య ఆసిస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో శ్రీ సత్య సాయి అవతార ప్రకటన దినోత్సవ వేడుకలను శివమ్ లో ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో, నిర్వహించారు. కార్యక్రమము శ్రీ ప్రముఖ సుప్రసిద్ధ సన్నాయి కళాకారుడు శ్రీ పురుషోత్తం నాయుడు గారి మరియు వారి బృందంతో, మంగళ వాద్యముతో, శ్రీ ఎం వి ఆర్ శేష సాయి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి, శ్రీమతి సుధా గారు, డాక్టర్ లక్ష్మి గారు జాతి ప్రకాశం గావించగా, కోటి సమితి సభ్యులచే, వేదపఠనం, సుస్వర భజనానంతరం, బాలవికాస్ కార్యక్రమాలలో భాగంగా, కుమారి సాయి వాణి, మరియు స్వాతి ప్రియాంక, కూచిపూడి ప్రదర్శం గావించి, అందరి మన్నలను పొందినారు. మాస్టర్ సశివాదన్, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అవతార విశేషాలను 10 నిముషాలు పాటు సోదాహరముగా వివరించగా, హాల్ నున్న వారందరు, కరతాళధ్వనులతో, వారి ఆనందమును వ్యక్తం చేసారు. బాలవికాస్ కార్యక్రమాలలో చివరి అంశముగా, మాస్టర్ హేమాంగ్ తానూ బాలవికాస్, చేరిన తరువాత, నేర్చుకున్న విషయములను, తెలియజేస్తూ, స్వామికి, గురువులకు, తల్లి తండ్రులకు కృతజ్ఞతలను తెలియ జేసాడు.
అవతార ప్రకటన దినోత్సవ వేడుకలలో భాగంగా, విద్యానగర్ లో గల భగవంతుడు నడయాడిన శివమ్ ప్రాగణంలో ఈ కార్యక్రమాన్ని10 మంది ప్రముఖ సుప్రసిద్ధ వీణా కళాకారులచే, వీణ వాదనలో తమ జీవితాలను కైకార్యము చేసికొంటున్న మేడూరి కుటుంబ సభ్యలు, మరియు వారి బృందం వీణా నాదార్చన, స్వామికి అత్యంత భక్తి శ్రద్దలతో, సమర్పించి, ఈ వీణ వాదనం సంగీత ప్రియులందరికీ, ఆనందాన్ని కల్పించిన దనుటలో, ఏ మాత్రము సందేహము లేదు.
ఈ వీణా నాదార్చన లో పాల్గొన్న కళాకారులూ, 1) కట్టమంచి సుబ్బలక్ష్మి సత్యానంద్,2) కె పద్మావతి, 3) మేడూరి కామదాస్, 4) కుమారి కే. లక్ష్మి శ్రావ్య, 5) శ్రీమతి లక్ష్మి సూరమ్మ, 6) శ్రీమతి సుందరి, 7) శ్రీ కే. సుధాకర్.8) శ్రీ శాస్తి గారు 9) శ్రీమతి వేలూరి లక్ష్మి గీత, 10) శ్రీమతి మల్లాది కామేశ్వరి.
అందరూ కలసి, మొదలుగా దర్భారు రాగములో వర్ణముతో ప్రారంభించి, హంసధ్వని రాగము, ఆదితాళం, ముతు స్వామి దీక్షితార్ “ వాతాపి గణపతిం భజే, రవిచంద్రిక రాగంలో ఆదితాళంలో “ త్యాగరాజ కీర్తన నిరవధి సుఖదా - అనే కీర్తన శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. శ్రీ రాగములో ఆదితాళంలో లో త్యాగరాజ కీర్తన “ ఎందరో మహానుభావులు వాయించినపుడు శ్రోతలు కరతాళ ధ్వనులతో, వారి ఆనందమును వ్యక్తము చేసారు. రఘువంశ సుదాంబుజి, కాదనకుతూహలరాగంలో, ఆదితాళంలో పట్నంసుబ్రమణ్య అయ్యారు, కీర్తన, తెలియగ లేరు రామ భక్తి మార్గము, తాగరాజా స్వామి కీర్తనకు మృదంగం పైన శ్రీ శ్రీనివాస్ అత్యంత అద్భుతముగా సహకరించి, సంగీత ప్రియ లందరికి మహ దానందము గావించాడు. కార్యక్రమము చిట్టిబాబు గారి వెడ్డింగ్ బెల్స్, చిట్టచివరగా, మోహన రాగంలో -- శ్రీ సత్య సాయి భజన గోవిందా కృష్ణ జై, గోపాల కృష్ణ జై -- అనే భజన తో - అందురు సత్యసాయి భక్తులు, సంగీత ప్రియులు కలసి పాడి కార్యక్రమము రక్తి కట్టించి, అందరి మన్నలు పొందినారు.
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, పర్వేక్షణలో సాగిన ఈ కార్యక్రమము కళాకారులందరిని, హైదరాబాద్ జిల్లా ఆద్యక్షులు, శ్రీ ఎం వి ఆర్ శేష సాయి, మరియు వి ఎస్ ఆర్ మూర్తి, ఈలపాటి శివ ప్రసాద్ గారు, వాసుదేవ రావు, ఎం ఎల్ ఎం స్వామి, గారు, విజయ లక్ష్మి, సీత మహా లక్ష్మి రేణుక అందరూ కలసి, కళాకారులను, మొమెంటోస్ తో, 2018 డైరీస్ తో ఘనముగా సత్కరించారు.
ఈ కార్యక్రములో చలమళ్ళ వెంకట లక్ష్మ రెడ్డి, శ్రీ వెంకట చక్రధర్, రాము, ప్రభాకర్, రాంచందర్, శైలేశ్వరి, కల్పన, వేణు, జానీ తదితలు, ఛురుకుగా పాల్గొన్నారు.
చివరగా, స్వామి వారికి, మేడూరి కుటుంబ సభ్యులు, మరి బృందం అందరూ కలసి స్వామికి మంగళ హారతి సమర్పించగా కార్యక్రమము ముగిసినది
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి,
PLEASE CLICK
PL CLCIK TO SEE VIDEO
PLEASE CLICK THE LINK TO VIEW THE PHOTOS PLEASE CLICK THE LINK :
No comments:
Post a Comment