Sunday, October 22, 2017

REPORT, PRESS CLIPPINGS, PHOTOS LINK, AUDIO LINKs of SRI SATHYA SAI AVATARA PRAKATANA CELEBRATIONS OF KOTI SAMITHI AT SHIVAM

ఓం శ్రీ సాయి రామ్
అవతార ప్రకటన దినోత్సవ వేడుకలు  20-10-2017

భగవాన్ శ్రీ సత్య సాయిబాబా దివ్య ఆసిస్సులతో శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, ఆధ్వర్యములో శ్రీ సత్య సాయి  అవతార ప్రకటన దినోత్సవ వేడుకలను  శివమ్ లో ఘనంగా అత్యంత భక్తి శ్రద్దలతో, నిర్వహించారు. కార్యక్రమము శ్రీ ప్రముఖ సుప్రసిద్ధ  సన్నాయి కళాకారుడు శ్రీ పురుషోత్తం నాయుడు గారి మరియు వారి బృందంతో, మంగళ వాద్యముతో, శ్రీ ఎం వి ఆర్ శేష సాయి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, శ్రీ వి ఎస్ ఆర్ మూర్తి, శ్రీమతి సుధా గారు, డాక్టర్ లక్ష్మి గారు జాతి ప్రకాశం గావించగా, కోటి సమితి సభ్యులచే,  వేదపఠనం,  సుస్వర భజనానంతరం, బాలవికాస్  కార్యక్రమాలలో భాగంగా, కుమారి సాయి వాణి, మరియు స్వాతి ప్రియాంక, కూచిపూడి ప్రదర్శం గావించి, అందరి మన్నలను పొందినారు. మాస్టర్ సశివాదన్, భగవాన్ శ్రీ సత్య సాయి బాబా అవతార విశేషాలను 10 నిముషాలు పాటు సోదాహరముగా వివరించగా, హాల్ నున్న వారందరు, కరతాళధ్వనులతో, వారి ఆనందమును వ్యక్తం  చేసారు.   బాలవికాస్  కార్యక్రమాలలో చివరి అంశముగా, మాస్టర్ హేమాంగ్ తానూ బాలవికాస్, చేరిన తరువాత, నేర్చుకున్న విషయములను, తెలియజేస్తూ, స్వామికి,  గురువులకు, తల్లి తండ్రులకు  కృతజ్ఞతలను తెలియ జేసాడు.

అవతార ప్రకటన దినోత్సవ వేడుకలలో భాగంగా, విద్యానగర్ లో గల భగవంతుడు నడయాడిన శివమ్ ప్రాగణంలో కార్యక్రమాన్ని10 మంది ప్రముఖ సుప్రసిద్ధ  వీణా  కళాకారులచే,  వీణ వాదనలో తమ జీవితాలను కైకార్యము చేసికొంటున్న మేడూరి కుటుంబ సభ్యలు, మరియు వారి బృందం  వీణా నాదార్చన, స్వామికి అత్యంత భక్తి శ్రద్దలతో, సమర్పించి,   వీణ వాదనం  సంగీత  ప్రియులందరికీ, ఆనందాన్ని కల్పించిన దనుటలో, మాత్రము సందేహము లేదు.  

వీణా నాదార్చన లో  పాల్గొన్న కళాకారులూ, 1) కట్టమంచి సుబ్బలక్ష్మి సత్యానంద్,2) కె పద్మావతి, 3) మేడూరి కామదాస్, 4) కుమారి కే. లక్ష్మి శ్రావ్య, 5) శ్రీమతి లక్ష్మి సూరమ్మ, 6) శ్రీమతి సుందరి, 7) శ్రీ కే. సుధాకర్.8)  శ్రీ శాస్తి గారు 9) శ్రీమతి వేలూరి లక్ష్మి గీత, 10) శ్రీమతి మల్లాది కామేశ్వరి.
అందరూ కలసి, మొదలుగా దర్భారు రాగములో వర్ణముతో ప్రారంభించి, హంసధ్వని రాగము, ఆదితాళం, ముతు స్వామి దీక్షితార్వాతాపి గణపతిం భజే, రవిచంద్రిక రాగంలో ఆదితాళంలోత్యాగరాజ కీర్తన నిరవధి సుఖదా - అనే కీర్తన శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. శ్రీ రాగములో ఆదితాళంలో లో త్యాగరాజ కీర్తనఎందరో మహానుభావులు వాయించినపుడు శ్రోతలు కరతాళ ధ్వనులతో, వారి ఆనందమును వ్యక్తము చేసారు. రఘువంశ సుదాంబుజి, కాదనకుతూహలరాగంలో, ఆదితాళంలో పట్నంసుబ్రమణ్య అయ్యారు, కీర్తన, తెలియగ లేరు రామ భక్తి మార్గము, తాగరాజా స్వామి కీర్తనకు మృదంగం పైన శ్రీ శ్రీనివాస్ అత్యంత అద్భుతముగా సహకరించి, సంగీత ప్రియ లందరికి మహ దానందము గావించాడు. కార్యక్రమము చిట్టిబాబు గారి వెడ్డింగ్ బెల్స్, చిట్టచివరగా, మోహన రాగంలో -- శ్రీ సత్య సాయి భజన గోవిందా కృష్ణ జై, గోపాల కృష్ణ జై -- అనే  భజన తో -  అందురు సత్యసాయి భక్తులు, సంగీత ప్రియులు కలసి పాడి కార్యక్రమము రక్తి కట్టించి, అందరి మన్నలు పొందినారు.
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి, పర్వేక్షణలో సాగిన కార్యక్రమము కళాకారులందరిని, హైదరాబాద్ జిల్లా ఆద్యక్షులు, శ్రీ ఎం వి ఆర్ శేష సాయి, మరియు వి ఎస్ ఆర్ మూర్తి, ఈలపాటి శివ ప్రసాద్ గారు, వాసుదేవ రావు, ఎం ఎల్ ఎం స్వామి, గారు, విజయ లక్ష్మి, సీత మహా లక్ష్మి రేణుక అందరూ కలసి, కళాకారులను, మొమెంటోస్ తో, 2018 డైరీస్ తో ఘనముగా సత్కరించారు.
కార్యక్రములో చలమళ్ళ వెంకట లక్ష్మ రెడ్డి, శ్రీ వెంకట చక్రధర్, రాము, ప్రభాకర్, రాంచందర్, శైలేశ్వరి, కల్పన, వేణు, జానీ తదితలు, ఛురుకుగా పాల్గొన్నారు.
చివరగా, స్వామి వారికి, మేడూరి కుటుంబ సభ్యులు, మరి బృందం అందరూ కలసి స్వామికి మంగళ హారతి సమర్పించగా కార్యక్రమము ముగిసినది
సమితి కన్వీనర్, విశ్వేశ్వర శాస్త్రి



PLEASE CLICK 


PL CLCIK TO SEE VIDEO 



Sunday, October 15, 2017





Report on Distribution of plants  DATED 15-10-2017


Please Click the Link to see the Photos  Distributing Plants by Balvikas Children of Koti Samithi. 


భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి బాబా దివ్య ఆసిస్సులతో, శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి హైదరాబాద్, వారి ఆధ్వర్యంలో,  శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు,   రోజు ఉదయం అంటే 15-10-2017  ఒక వినూత్న సేవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, అబిడ్స్, జంక్షన్ లో  జవహర్ లాల్ నెహ్రు విగ్రహం దగ్గర, ట్రాఫిక్ స్టాప్ సిగ్నల్, పడగానే వాహన చోదకులలో ఒక అవగాహన కల్పించి, వారికి, అలవెరా మొక్కలను,  మధుమేఘము తగ్గించే నీలవేణి, మొక్కలను, తులసి మొక్కలను, నేరేడు చెట్టు  మొక్కలను, ఇచ్చి, మొక్కలను జాగ్రత్తగా వారి వారి గృహములలో మొక్కలునాటుకొని  , వాటి వల్ల ప్రయోజనము పొందవలసినదిగా కోరుతూ, వారికీ  దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తూ మొక్కలను అందజేశారు.  బాలవికాస ఇంచార్జి, శ్రీ సీత మహాలక్ష్మి, సిఐ శ్రీకాంత్ గారికి కూడా మధుమేఘము తగ్గించే ఔషధ కక్షణాలున్న నీలవేణి మొక్కను వితరణ గావించారు.       పవిత్ర కార్యక్రమము లో అబిడ్స్, ట్రాఫిక్  సిఐ శ్రీకాంత్ గారు, పలువురు ట్రాఫిక్ కాన్స్టేబుల్పై,  పాల్గొని ప్రోత్సహామును ఇచ్చి, శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమము లో  మరియు, చల్లా రామ ఫణి, బాలవికాస్ గురూస్ ఇంచార్జి, శ్రీ సీత మహాలక్ష్మి, బాలవికాస గురు రేణుక, 10 మంది బాలవికాస విద్యార్థులు, పాల్గొన్నారు. కార్యక్రమంతా, సమితి కన్వీనర్, విశ్శ్వేశ్వర శాస్త్రి పర్వేవేక్షణలో జరిగినది.

సమితి కన్వీనర్ విశ్వేశ్వర శాస్త్రి