Thursday, May 4, 2017

“ ఇంటర్నెట్టే కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే ఒక సందేశాత్మక మైన నాటిక - శ్రీ సత్య సాయి విద్యా విహార్ - 4-5-2017

స్వామి వారి దివ్య ఆశీర్వచనములలో, ఉచిత వేసవి శిక్షణ శిభిరాన్ని , శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, గత 8 సంవత్సలుగా నిర్వహిసున్న విషయము తెలిసినదే. ఈ సంవత్సము, “ ఇంటర్నెట్టే  కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే  ఒక సందేశాత్మక మైన నాటిక ను, వేసవి శిక్షణ శిభిర సభ్యులలో నిర్వహించి శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాగంణంలో జరిగిన ముగింపు కార్యక్రమములో ప్రదర్శించి , అంతటి తో ఆగక, శ్రీ సత్య సాయి విద్యా విహార్ లో జరుగుతున్నా, residential వేసవి శిక్షణ శిభిరము లో దాదాపు 300 మంది పిల్లలు, పెద్దలు, గురువులు, శ్రేయేభిలాషుల మధ్యలో, స్వామి నడయాడిన పవిత్ర ప్రాంగణములో ఒక పెద్ద సభా మండపములో, కేవలము కొద్దీ రోజులగా శిక్షణపొంది, శ్రీ సత్య సాయి సేవ సంస్థలతో, సంభంధము వున్నవీరు బాలవికాస విద్యార్థుల రీతిలో, ఏంతో, నేర్పుతో ప్రదర్శన నిచ్చి అందరి ప్రశంశలు అందుకొన్నారనుటలో, ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.


ఈ సందర్భముగా, స్వామి వారికీ హృదయ పూర్వక నామసుమాంజలులు తెలుపుకుంటూ, బాలవికాస్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీమతి నీరజ గారికి, గోపికృష్ణ దంపతులకు, కార్యక్రమాన్ని ఆస్వాదించి, వారి స్పందనను తెలిపిన, శ్రీ వి ఎస్ ఆర్ శర్మ, దంపతులకు, అనేక అనేక సాయిరాంలు తెలుపుకుంటూ  ఏంతో ఓపికతో కూర్చొని ఏంతొ శ్రద్ధతో తిలకించి, ఆస్వాదించి, కరతాళధ్వనులతో, వారి ఆనందమును వ్యక్తపరచిన,  చిన్నారులకు, స్వామి దివ్య ఆసిస్సులు ఉండాలని కోరుకుంటూ, జై సాయి రామ్.

ముఖ్యముగా, “ ఇంటర్నెట్టే  కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే  ఒక సందేశాత్మక మైన నాటిక రూప కల్పన లో  పాల్గొన్న  ప్రతివారికి, అభినందనలు, శుభాకాంక్షలు స్వామి వారి దివ్య ఆసిస్సులు ఉండాలని కోరుకుంటూ, మరిన్ని మంచి అవకాశముల కొరకు ప్రార్ధిస్తు .... జై సాయి రామ్.

Please Click Here to See Drama Photos


Sunday, April 30, 2017

REPORT ON SUMMER CAMP 2017 24TH APRIL TO 30TH APRIL 2017



REPORT ON SUMMER CAMP
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా   వారి దివ్య ఆశీర్వచనములలో, ఉచిత వేసవి శిక్షణ శిభిరన్నీ, శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, గత 8 సంవత్సలుగా నిర్వహిసున్న విషయము తెలిసినదే. ఈ సంవత్సము, కూడా శ్రీ సత్య సాయి ఆరాధనా దినోత్సవం నాడు, అంటే 24-4-2017 న ప్రారంభమైన ఈ శిభిరం 30-4-2017 అదే శంకర జయంతితో ముగిసినది. ఈ శిభిరంలో మొదటి రోజు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చినప్పటికీ 25 మంది ఏంతో ఆసక్తి తో పాల్గొన్నారు. ఈ కార్యక్రములో విద్యా  జ్యోతి పిల్లలు కూడా పాల్గొనుట ఒక విశేషము.

ఈ ఉచిత వేసవి శిక్షణ శిభిరం ప్రతి రోజు ఉదయం  8-30 గంటలకు ప్రారంభమై సాయంత్రము 3 గంటల దాకా కొనసాగింది. ప్రతి రోజు, వేదం తో ప్రారంభించి,   పెద్ద స్క్రీన్ పై స్వామి వారి దర్శనము, తరువాత 5 నిమిషాల పాటు ధ్యానము, వారు పొందిన అనుభూతి తెలుసుకొని,  ఒక సత్య సాయి శతకము లోని పద్యము దాని భావమును వివరించి, దానిని వల్లే వేయించి, అప్పటి కప్పుడు, అప్ప జెప్పించు కొని వారికీ ఒక ప్రింట్ అవుట్ ఇవ్వడము రోజు వారి కార్యక్రమము.

Pl click the link and listen the poems .

పద్యములతో పాటు, పాట, చిన్న నీతి  కధలు, listening skills develop చేయుటకు, దసరా నవరాత్రులలో, రేడియో సాయి వారు ప్రసారము చేసిన, ప్రతి రోజు ఒక, లఘు స్వామి సందేశము, దానితో పాటు, ఆ సందేశమునకు సంభందించిన  రెండు చిన్నినాటకములు వినిపించుట, దానినుండి, ప్రశ్నలు వేయుట, జరిగినది. క్షమా, క్రమశిక్షణ, ప్రేమ, కోరికలపై అదుపు అనే అంశాలు చోటుచేసుకొన్నవి. Raghuram bhatt గారి సహస ఘట్టము, రేడియో సాయి వారి సౌజన్యముతో, Uncle Lion's and Tales నాధారముగా, కార్టూన్ చిత్ర ప్రదర్శన, కథలు వివరణ, క్విజ్, పంచభూతముల వివరణ, దాని సంభందిత, ఆధ్యాత్మిక ఆటలు,  ఒక ఒక సందేశాత్మక మైన నాటిక, “ ఇంటర్నెట్ కాదు ఇన్నర్ నెట్ కావాలి” ను ప్రాక్టీసు ను, వేసవి శిక్షణ శిభిరములో నిర్వహించింది. ప్రతి సంవత్సరము మాదిరిగానే, SNOW WORLD సందర్శన, ఈ సంవత్సరము కూడా 42 విద్యార్థులు పాల్గొని, ఆనంద పరవసు లైనారను టలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. చివరి రోజున, అంటే 30-4-2017 న, శంకర జయంతిని పురస్కరించుకొని, శ్రీ కౌశిక్ బాబు నటించిన “ జగత్ గురు అది శంకరాచార్య” అనే చలన చిత్రమును బిగ్ స్క్రీన్ పై క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఎఫెక్ట్ సౌండ్ సిస్టం తో చూపించే సదావకమును ప్రసాదించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్య్నాతలు.  చివరగా, రోజు  ప్రాక్టీసు చేసిన   25 నిమిషముల నిడివిగల, “ ఇంటర్నెట్టే కాదు ఇన్నర్ నెట్ కావాలి”” అనే సందేశాత్మక మైన నాటికను మా హాల్ లోనే రికార్డు చేసి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చి, PLAY చేయగా, వేసవి శిక్షణ శిభిరములోని పిల్లలు అద్భుతముగా వారికి ఇచ్చిన ట్రైనింగ్  ప్రకారము పాల్గొని, అందరి మన్నలు పొందినారు. ఈ కార్యక్రమమును, ముఖ పుస్తకము ద్వారా, అంటే FACE BOOK LIVE ద్వారా, చూచిన ప్రతివారు, వారి అభినందనలు, తెలిపి నందుకు వారికీ కూడా హృత్ పూర్వక కృతజ్య్నాతలు.

ఈ శిభిరంలో, 11-30 షార్ట్ బ్రేక్, (15 నిమిషములు )  మరియు 1 గంటకు, లంచ్ బ్రేక్       (గంట సేపు) ఇచ్చి, పౌష్ఠికాఆహారమును, సర్వ్ చేసే వాళ్లము. వేడి అన్నము, పప్పు, పచ్చడి, పెరుగు, చిప్స్, ఇచ్చే వాళ్ళము. సర్వ్ చేసే మాకు, తేనే వాళ్ళకి, మహదానందము ప్రసాదించారు స్వామి.

చివరగా వారికీ, ప్రతి అది వారము సాగే బాలవికాస్  తరగతులకు, 8-30 గంటలనుండి, 10-30 గంటల వరుకు సాగే కార్యక్రమమునకు స్వాగతము పలికి, అందరము కలసి స్వామి వారికీ మంగళ హారతి సమర్పించి, అందరము కలసి బ్రహ్మార్పణము చెప్పి, స్వామి వారి ప్రసాదము తీసుకొని, ఈ కార్యక్రమమును దిగ్విజయముగా ఏ ఆటంకములు లేకుండా జరిపించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్య్నాతలు తెలుపుకుంటూ, ప్రత్యక్రముగా, మరి పరోక్షంగా,  సహకరించిన, ప్రతివారికి, ప్రకాష్ గారికి, చక్రధర్ గారికి, వెంకట్రావు గారికి, శరన్ గారికి, మాన్యవర్ మల్లికార్జున్ గారికి, శిభిరమునకు పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, డ్రామాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సభ్యలకు, వారి కుటుంబ సభ్యలకు  కార్యక్రమ నిర్వాహకులకు, వారి కుటుంబ సభ్యలకు,  స్వామి దివ్య ఆసిస్సులు ఏల్ల వేళల ఉండాలని, మరిన్ని కార్యక్రమలలో పాల్గొనే శక్తిని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ .  జై సాయి రామ్.

రిపోర్ట్
విశ్వేశ్వర శాస్త్రి

సమ్మర్ క్యాంపు లో తీసిన ఫొటోస్ చూడాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.

స్నో వరల్డ్ దగ్గర తీసిన చిన్న వీడియో చూడాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.

సమ్మర్ క్యాంపు లో 25 నిమిషముల నిడివిగల, “ ఇంటర్నెట్టే కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే సందేశాత్మక మైన నాటికను వినాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.


కుమారి సాయి  వాణి వినిపించే పద్యము దాని భావము, దానికి సంబందించిన Uncle Lion's and Tales నాధారముగా చేసుకొని చెప్పబడిన విషయములను వినాలను కుంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.


పిల్లలంతా పాటలు పద్యాలూ, కధలు, క్విజ్  వినాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.


----O0O---

Saturday, March 25, 2017

KOTI SAMITHI BAL VIKAS PROGRAM IN MAURITIUS RADIO BROADCASTING. DT 25-3-2017

Please Click Here to see live program of Sri Sanjeeva Narasimha Appadu in MBC last 10 minutes Koti Samithi Balvikas Program


Sunday, March 12, 2017

Balvikas 12-3-2017



శ్రీ సత్య సాయి సేవ సంస్థలు కోటి సమితి, హైదరాబాద్ ప్రతి ఆదివారం ఉదయం 8-30 గంటలనుండి 10-30 గంటల వరకు, బాలవికాస్, తరగతులను తీసుకొంటున్న విషయము విదితమే. ఈ నాటి బాలవికాస్ తరగతి లో శ్రీ సత్య సాయి పద్య సూక్తము, దాని భావము, వాక్య విభూతి, మరియు, శ్రీ రఘరామ్  భట్ గారి సాహసో పేతమైన, అద్భుత, స్కై డై వ్ వీడియోను  పెద్ద స్క్రీన్ పై వెసి, వారి గురించి తెలిపి, ఆశ్చర్య చకితులను గావించడమైనది. ఈ సందర్భముగా, మేము అందరమూ, భూమికి 12000 అడుగుల ఎత్తులో, స్వామి థాంక్యూ స్వామి, సాయిరాం అని తన ఆనందాన్ని మన అందరికి పంచిన రఘురాం గారికి స్వామి సంపూర్ణ ఆయురాగ్యములు ప్రసాదించాలని కోరుకుంటూ సాయిరాం. మీరు కూడా ఈ క్రింద నున్న లంకెను నొక్కండి. 
Please Click Here to See Sri Raghu Ram Bhatt - Sky Rider


Sunday, March 5, 2017

PARENTING MEETING - TORI RADIO PROGRAM... SANJEEVA NARASIMHA APPADU, VISSA, RENUKA, SEETA MAHA LAKSHMI.

Please Click here to listen the radio recording on Parenting Program in Telugu Talli Prema on 25-2-2015 with Sanjeeva Narasaimha Appadu

Friday, October 14, 2016