Sunday, April 30, 2017

REPORT ON SUMMER CAMP 2017 24TH APRIL TO 30TH APRIL 2017



REPORT ON SUMMER CAMP
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్య సాయిబాబా   వారి దివ్య ఆశీర్వచనములలో, ఉచిత వేసవి శిక్షణ శిభిరన్నీ, శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, గత 8 సంవత్సలుగా నిర్వహిసున్న విషయము తెలిసినదే. ఈ సంవత్సము, కూడా శ్రీ సత్య సాయి ఆరాధనా దినోత్సవం నాడు, అంటే 24-4-2017 న ప్రారంభమైన ఈ శిభిరం 30-4-2017 అదే శంకర జయంతితో ముగిసినది. ఈ శిభిరంలో మొదటి రోజు ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు వచ్చినప్పటికీ 25 మంది ఏంతో ఆసక్తి తో పాల్గొన్నారు. ఈ కార్యక్రములో విద్యా  జ్యోతి పిల్లలు కూడా పాల్గొనుట ఒక విశేషము.

ఈ ఉచిత వేసవి శిక్షణ శిభిరం ప్రతి రోజు ఉదయం  8-30 గంటలకు ప్రారంభమై సాయంత్రము 3 గంటల దాకా కొనసాగింది. ప్రతి రోజు, వేదం తో ప్రారంభించి,   పెద్ద స్క్రీన్ పై స్వామి వారి దర్శనము, తరువాత 5 నిమిషాల పాటు ధ్యానము, వారు పొందిన అనుభూతి తెలుసుకొని,  ఒక సత్య సాయి శతకము లోని పద్యము దాని భావమును వివరించి, దానిని వల్లే వేయించి, అప్పటి కప్పుడు, అప్ప జెప్పించు కొని వారికీ ఒక ప్రింట్ అవుట్ ఇవ్వడము రోజు వారి కార్యక్రమము.

Pl click the link and listen the poems .

పద్యములతో పాటు, పాట, చిన్న నీతి  కధలు, listening skills develop చేయుటకు, దసరా నవరాత్రులలో, రేడియో సాయి వారు ప్రసారము చేసిన, ప్రతి రోజు ఒక, లఘు స్వామి సందేశము, దానితో పాటు, ఆ సందేశమునకు సంభందించిన  రెండు చిన్నినాటకములు వినిపించుట, దానినుండి, ప్రశ్నలు వేయుట, జరిగినది. క్షమా, క్రమశిక్షణ, ప్రేమ, కోరికలపై అదుపు అనే అంశాలు చోటుచేసుకొన్నవి. Raghuram bhatt గారి సహస ఘట్టము, రేడియో సాయి వారి సౌజన్యముతో, Uncle Lion's and Tales నాధారముగా, కార్టూన్ చిత్ర ప్రదర్శన, కథలు వివరణ, క్విజ్, పంచభూతముల వివరణ, దాని సంభందిత, ఆధ్యాత్మిక ఆటలు,  ఒక ఒక సందేశాత్మక మైన నాటిక, “ ఇంటర్నెట్ కాదు ఇన్నర్ నెట్ కావాలి” ను ప్రాక్టీసు ను, వేసవి శిక్షణ శిభిరములో నిర్వహించింది. ప్రతి సంవత్సరము మాదిరిగానే, SNOW WORLD సందర్శన, ఈ సంవత్సరము కూడా 42 విద్యార్థులు పాల్గొని, ఆనంద పరవసు లైనారను టలో ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు. చివరి రోజున, అంటే 30-4-2017 న, శంకర జయంతిని పురస్కరించుకొని, శ్రీ కౌశిక్ బాబు నటించిన “ జగత్ గురు అది శంకరాచార్య” అనే చలన చిత్రమును బిగ్ స్క్రీన్ పై క్రిస్టల్ క్లియర్ సౌండ్ ఎఫెక్ట్ సౌండ్ సిస్టం తో చూపించే సదావకమును ప్రసాదించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్య్నాతలు.  చివరగా, రోజు  ప్రాక్టీసు చేసిన   25 నిమిషముల నిడివిగల, “ ఇంటర్నెట్టే కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే సందేశాత్మక మైన నాటికను మా హాల్ లోనే రికార్డు చేసి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సమకూర్చి, PLAY చేయగా, వేసవి శిక్షణ శిభిరములోని పిల్లలు అద్భుతముగా వారికి ఇచ్చిన ట్రైనింగ్  ప్రకారము పాల్గొని, అందరి మన్నలు పొందినారు. ఈ కార్యక్రమమును, ముఖ పుస్తకము ద్వారా, అంటే FACE BOOK LIVE ద్వారా, చూచిన ప్రతివారు, వారి అభినందనలు, తెలిపి నందుకు వారికీ కూడా హృత్ పూర్వక కృతజ్య్నాతలు.

ఈ శిభిరంలో, 11-30 షార్ట్ బ్రేక్, (15 నిమిషములు )  మరియు 1 గంటకు, లంచ్ బ్రేక్       (గంట సేపు) ఇచ్చి, పౌష్ఠికాఆహారమును, సర్వ్ చేసే వాళ్లము. వేడి అన్నము, పప్పు, పచ్చడి, పెరుగు, చిప్స్, ఇచ్చే వాళ్ళము. సర్వ్ చేసే మాకు, తేనే వాళ్ళకి, మహదానందము ప్రసాదించారు స్వామి.

చివరగా వారికీ, ప్రతి అది వారము సాగే బాలవికాస్  తరగతులకు, 8-30 గంటలనుండి, 10-30 గంటల వరుకు సాగే కార్యక్రమమునకు స్వాగతము పలికి, అందరము కలసి స్వామి వారికీ మంగళ హారతి సమర్పించి, అందరము కలసి బ్రహ్మార్పణము చెప్పి, స్వామి వారి ప్రసాదము తీసుకొని, ఈ కార్యక్రమమును దిగ్విజయముగా ఏ ఆటంకములు లేకుండా జరిపించిన స్వామికి హృదయ పూర్వక కృతజ్య్నాతలు తెలుపుకుంటూ, ప్రత్యక్రముగా, మరి పరోక్షంగా,  సహకరించిన, ప్రతివారికి, ప్రకాష్ గారికి, చక్రధర్ గారికి, వెంకట్రావు గారికి, శరన్ గారికి, మాన్యవర్ మల్లికార్జున్ గారికి, శిభిరమునకు పిల్లలను పంపిన తల్లిదండ్రులకు, డ్రామాకు వాయిస్ ఓవర్ ఇచ్చిన సభ్యలకు, వారి కుటుంబ సభ్యలకు  కార్యక్రమ నిర్వాహకులకు, వారి కుటుంబ సభ్యలకు,  స్వామి దివ్య ఆసిస్సులు ఏల్ల వేళల ఉండాలని, మరిన్ని కార్యక్రమలలో పాల్గొనే శక్తిని ప్రసాదించాలని ప్రార్ధిస్తూ .  జై సాయి రామ్.

రిపోర్ట్
విశ్వేశ్వర శాస్త్రి

సమ్మర్ క్యాంపు లో తీసిన ఫొటోస్ చూడాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.

స్నో వరల్డ్ దగ్గర తీసిన చిన్న వీడియో చూడాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.

సమ్మర్ క్యాంపు లో 25 నిమిషముల నిడివిగల, “ ఇంటర్నెట్టే కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే సందేశాత్మక మైన నాటికను వినాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.


కుమారి సాయి  వాణి వినిపించే పద్యము దాని భావము, దానికి సంబందించిన Uncle Lion's and Tales నాధారముగా చేసుకొని చెప్పబడిన విషయములను వినాలను కుంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.


పిల్లలంతా పాటలు పద్యాలూ, కధలు, క్విజ్  వినాలంటే ఈ క్రింద నున్న లింక్ ను నొక్కండి.


----O0O---

No comments:

Post a Comment