శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో మహాత్మా గాంధీ 154వ జయంతి వేడుకలు
శ్రీ సత్య సాయి సేవా సంస్థలు కోటి సమితి ఆధ్వర్యంలో, సుల్తాన్ బజార్ లో గల సత్య సాయి బాలవికాస్, సెంటర్ లో ఈ రోజు బాల వికాస్ కార్యక్రమములో భాగంగా, గాంధీ గారి గురించి కొన్ని విషయములు, మన బాలవికాస్ తరగతిలో విద్యార్థులకు బోధించుచు, మహాత్మా గాంధీ 154వ జయంతిని పురస్కరించుకొని శ్రీ సత్య సాయి బాలవికాస్ విద్యార్థులు మహాత్మా గాంధీ చిత్రపటానికి గులాబీ పుష్పములు సమర్పించి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువులు, విశ్వేశ్వర శాస్త్రి, ఈ అంశములను తెలిపినారు.
మోహన్ దాస్ కరంచంద్ గాంధీ" 1869 అక్టోబరు 2 వ తేదీన గుజరాత్ లోని పోర్ బందర్లో ఒక సామాన్య సాంప్రదాయక కుటుంబములో జన్మించాడు. అతని తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. జీవిత భాగస్వామి కస్తూర్బా
గాంధీ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి, స్వాతంత్యము సాధించిన నాయకులలో అగ్రగణ్యులు
ప్రజలు గాంధీగారిని, మహాత్ముడు, అని, జాతిపిత అని, గౌరవిస్తారు.
గాంధీజి నమ్మే సిద్దాంతములు, సత్యము, అహింస, సహాయ నిరాకరణ, సత్యాగ్రహము వారి ఆయుధాలు.
గాంధీ ప్రచురించిన పత్రిక ఇండియన్ ఒపీనియన్.
గాంధీ ఆలోచనలపై అత్యధిక ప్రభావము, చూపిన గ్రంధము భగవద్గీత
బ్రిటీషు వారు భారత దేశం నుండి వెడలి పోవాలని 1942 లో క్విట్ ఇండియా ఉద్యమమును ప్రారంభించారు.
1930 లో ఉప్పు సత్యాగ్రహమును ప్రారంభించారు.
1948 జనవరి 30వ తారీఖున ఢిల్లీలో బిర్లా నివాసంవద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా అతన్ని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. నేలకొరుగుతూ గాంధీ "హే రామ్" అన్నాడని చెబుతారు
శ్రీమతి రేణుక ఒక పద్యమును నేర్పించారు.
సత్య ,ధర్మ, శాంతి, ప్రేమ, అహింసయు,
మానవుని పంచ ప్రాణాలు మహిని వెలయు,
పంచ ప్రాణాలలో ప్రేమ యెంత హెచ్చు
కాన హృదయాన ప్రేమను గట్టిపరచు
మరియు తల్లి యే మొదటి గురువని తెలియ జేసే, "కోకిల వ్రతం"అనే కథను, విద్యార్థులకు వివరించారు. ఈ కథ ద్వారా గాంధీజీ, వారి అమ్మగారైన పూతిలీబాయి కి తానూ ఎన్నడూ ఎట్టి పరిస్థులలో, అబద్ధము ఆడానని, తెలియజేశారు. కోటి సమితి విద్యార్థులు కూడా, పుష్పములు సమర్పించి, అదే శక్తిని ప్రసాదించమని ప్రార్ధన సలిపారు. గురువులు నిన్న అనగా 1-10-2023 న నేర్పిన 10 అంశములను, గాంధీజీ చిత్రపటమును గీసి, ఈ పది అంశములు వ్రాసుకొని వచ్చారు. ఈ నాటి జయంతి కార్యక్రములో సాత్విక , సుప్రియ, అనన్య , సంహిత, అఖిలేశ్వర్ సాయి ప్రసాద్ , బలేశ్వర సాయి ప్రసాద్ , నిహారిక నవలే, ఆశ్రీత్ , తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమము శాంతి మంత్రముతో ముగిసినది.