ఈరోజు (13-2-21) బాలవికాస్ క్లాస్లో స్వామివారి అష్టోత్తర నామాలు (40-50) వివరించి చెప్పాను. ఎట్టి కర్మ యు.... అనే పధ్యము చెప్పి వివరించాను. మరియు సంపూర్ణ శరణాగతి అనే కథను తెలిపాను. రోజు పిల్లలందరూ గాయత్రి మంత్రాన్ని చదువుతున్నారా లేదా తెలుసుకున్నాను.
" జయహో జయహో గోపాల్ " అనే భజనను కల్పన గారు నేర్పించారు.
ఈరోజు (14-2-21) మొదలుపెట్టిన కోడింగ్ క్లాస్ కోచింగ్ లో మన బాల వికాస్ పిల్లలు (హేమంత్, గాయత్రి, లీల ధర్ ,ప్రణవ్, సాయి, నాగ) పాల్గొన్నారు.
13-2-2021 న చెప్పినారు.
కర్మ చేయగ నరునకు కలదు హక్కు
అడుగు ఫలమును నరునకు హక్కు లేదు
కర్మ ఫలిమిచ్చు దాతకే కలదు హక్కు
ఇంత కన్నను వేరెడ్డి ఎరుక పరతు.
పనిచేసే విషయంలోనే మనిషికి హక్కు వున్నది. కానీ ఫలితాన్ని, అడిగే హక్కు మాత్రం అతనికి లేదు. కర్మ ఫలాన్ని, ఇచ్చే అయిన భగవంతునికే ఆ విషయంలో అధికారముంది. కనుక ప్రతి ఫలాన్ని, కోరకుండా, కర్తవ్య కర్మలను, చేయండి. ఇదియే కర్మ రహస్యము. ఇంతకంటే చెప్పవలిసినదేమున్నది? ( మన కర్మలు మానాలనే బంధించకుండా నేర్పును అలవర్చుకుని మన కర్మ యెగులము కావలెనని స్వామి మనకు ప్రభోదించుచున్నారు.
27-2-2021
సాయిరాం, ఈరోజు 27-2-2021 న బాలవికాస్ క్లాస్ కి భద్రాదేవి ,గుప్తా శరణ్య, లీల ధర్, గాయత్రి, సాయి, నాగ పాల్గొన్నారు.
ఈరోజు క్లాసులో నమ్మకమను రెండు నయనంబులే లేని- అనే పద్యము, శివరాత్రి పండుగ గురించి, మరియు 2 కథలు- (దృష్టి- దృశ్యము) తెలియచేసి, పేపర్ తో పర్సు, స్మాల్ హాట్ తయారు చేయ డం చూపించాను.
పిల్లలతో నాలుగు భగవద్గీత శ్లోకాలు మరియు 1- 30 అష్టోత్తర నామాలు చెప్పించాను.