స్వామి వారి దివ్య ఆశీర్వచనములలో, ఉచిత వేసవి శిక్షణ శిభిరాన్ని , శ్రీ శ్రీ శ్రీ సత్య సాయి సేవా సంస్థలు, కోటి సమితి, గత 8 సంవత్సలుగా నిర్వహిసున్న విషయము తెలిసినదే. ఈ సంవత్సము, “ ఇంటర్నెట్టే కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే ఒక సందేశాత్మక మైన నాటిక ను, వేసవి శిక్షణ శిభిర సభ్యులలో నిర్వహించి శ్రీ సత్య సాయి స్టడీ సర్కిల్ ప్రాగంణంలో జరిగిన ముగింపు కార్యక్రమములో ప్రదర్శించి , అంతటి తో ఆగక, శ్రీ సత్య సాయి విద్యా విహార్ లో జరుగుతున్నా, residential వేసవి శిక్షణ శిభిరము లో దాదాపు 300 మంది పిల్లలు, పెద్దలు, గురువులు, శ్రేయేభిలాషుల మధ్యలో, స్వామి నడయాడిన పవిత్ర ప్రాంగణములో ఒక పెద్ద సభా మండపములో, కేవలము కొద్దీ రోజులగా శిక్షణపొంది, శ్రీ సత్య సాయి సేవ సంస్థలతో, సంభంధము వున్నవీరు బాలవికాస విద్యార్థుల రీతిలో, ఏంతో, నేర్పుతో ప్రదర్శన నిచ్చి అందరి ప్రశంశలు అందుకొన్నారనుటలో, ఏ మాత్రమూ అతిశయోక్తి లేదు.
ఈ సందర్భముగా, స్వామి వారికీ హృదయ పూర్వక నామసుమాంజలులు తెలుపుకుంటూ, బాలవికాస్, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ శ్రీమతి నీరజ గారికి, గోపికృష్ణ దంపతులకు, కార్యక్రమాన్ని ఆస్వాదించి, వారి స్పందనను తెలిపిన, శ్రీ వి ఎస్ ఆర్ శర్మ, దంపతులకు, అనేక అనేక సాయిరాంలు తెలుపుకుంటూ ఏంతో ఓపికతో కూర్చొని ఏంతొ శ్రద్ధతో తిలకించి, ఆస్వాదించి, కరతాళధ్వనులతో, వారి ఆనందమును వ్యక్తపరచిన, చిన్నారులకు, స్వామి దివ్య ఆసిస్సులు ఉండాలని కోరుకుంటూ, జై సాయి రామ్.
ముఖ్యముగా, “ ఇంటర్నెట్టే కాదు ఇన్నర్ నెట్ కావాలి” అనే ఒక సందేశాత్మక మైన నాటిక రూప కల్పన లో పాల్గొన్న ప్రతివారికి, అభినందనలు, శుభాకాంక్షలు స్వామి వారి దివ్య ఆసిస్సులు ఉండాలని కోరుకుంటూ, మరిన్ని మంచి అవకాశముల కొరకు ప్రార్ధిస్తు .... జై సాయి రామ్.